జేఎన్ టి యూహెచ్ యూనివర్సిటీ బెస్ట్ ఫిజిక్ పురుషుల జట్టు ఎంపిక విజయవంతం..

ఎంపిక ప్రక్రియను స్పోర్ట్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రొఫెసర్ ఎన్ఎస్ దిలీప్,  అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నల్గొండ అశోక్  ఆధ్వర్యంలో సమర్థవంతంగా నిర్వహించారు.

జేఎన్ టి యూహెచ్ యూనివర్సిటీ బెస్ట్ ఫిజిక్ పురుషుల జట్టు ఎంపిక విజయవంతం..

 


కుత్బుల్లాపూర్ జనవరి 29 (లోకల్ గైడ్ ప్రతినిధి)

ఎంపికైన క్రీడాకారులను అభినందించిన ప్రొఫెసర్ ఎన్ఎస్ దిలీప్,అసిస్టెంట్ ప్రొఫెసర్ నల్గొండ అశోక్..జేఎన్ టి యూహెచ్ యూనివర్సిటీ ఇండోర్ స్టేడియంలో బెస్ట్ ఫిజిక్ పురుషుల జట్టు ఎంపిక  నిర్వహించారు. ఈ ఎంపిక ప్రక్రియను స్పోర్ట్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రొఫెసర్ ఎన్ఎస్ దిలీప్,  అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నల్గొండ అశోక్  ఆధ్వర్యంలో సమర్థవంతంగా నిర్వహించారు.
ఈ సెలక్షన్ ప్రక్రియకు చీఫ్ సెలెక్టర్‌గా వాగేశ్వరి ఇంజనీరింగ్ కాలేజ్ ఫిజికల్ డైరెక్టర్ శ్రీపాది దామోదర్  వ్యవహరించారు. ఈ ఎంపికల్లో ఎంపికైన క్రీడాకారులు, ఆంధ్రప్రదేశ్‌లోని ఆంధ్ర యూనివర్సిటీలో మార్చి 3వ తేదీ నుండి మార్చి 4వ తేదీ వరకు నిర్వహించబడే ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ బెస్ట్ ఫిజిక్ ఛాంపియన్‌షిప్‌లో జేఎన్టీయూహెచ్ తరఫున పాల్గొననున్నారు.
ఈ సందర్భంగా ప్రొఫెసర్ ఎన్ఎస్ దిలీప్  మాట్లాడుతూ, బెస్ట్ ఫిజిక్ క్రీడలో పాల్గొనాలంటే శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, నిరంతర కృషి ఎంతో అవసరమని తెలిపారు. క్రీడాకారులు కష్టపడి సాధన చేసి యూనివర్సిటీ కి  జాతీయ స్థాయిలో మంచి పేరు తీసుకురావాలని సూచించారు...

Tags:

About The Author

Latest News

ఎన్నికల సంఘం కార్యాలయాన్ని సందర్శించి మెమోరాండం సమర్పించిన           ఎన్నికల సంఘం కార్యాలయాన్ని సందర్శించి మెమోరాండం సమర్పించిన          
కుత్బుల్లాపూర్ ఫిబ్రవరి 10 (లోకల్ గైడ్ ప్రతినిధి)  జిల్లాల నుండి పనిచేసే ఉద్దేశ్యంతో హైదరాబాద్‌లో నివసిస్తున్న అనేక మంది ఓటర్లను మేము గమనించాము.  వారు తమ ఓటు...
12న బెల్లంపల్లిలో బాడీ బిల్డింగ్ పోటీలు....
జిల్లాలోని మున్సిపల్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన డిసిపి. 
శివరాంపల్లి పిల్లర్ నెంబర్ 274 వద్ద  ట్రాఫిక్ సమస్య పరిష్కరించండి.                                                                
నూతన గుడి నిర్మాణానికి విరాళం
రవాణా రంగా పరిరక్షణ కార్మిక హక్కులకై జరిగే జాతీయ సమ్మె జయప్రదం చేయండి..
ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ జరుగుతోంది.. బాధ్యులపై ఉక్కుపాదం తప్పదు