డివిజన్ అభివృద్ధికి సంపూర్ణ సహకారం..ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి.
వివిధ అభివృద్ధి పనులకు పఠాన్ చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
పఠాన్ చేరు, (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ): పఠాన్ చేరు నియోజకవర్గ పరిధిలోని భారతి నగర్, రామచంద్రాపురం డివిజన్ లలో రూ.5 కోట్ల 65 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు పఠాన్ చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. బల్దియా పరిధిలోని అన్ని డివిజన్ ల సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని, మౌలిక వసతుల కల్పనకు ఎలాంటి లోటు లేకుండా సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు. రహదారులు, డ్రైనేజీ, తాగునీరు, ఇతర సివిల్ పనులు ప్రాధాన్యతతో చేపడుతున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు సింధు ఆదర్శ్ రెడ్డి, పుష్ప నగేష్, అమీన్పూర్ డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్, డీఈ వెంకటరమణ, మాజీ కార్పొరేటర్ అంజయ్య, సీనియర్ నాయకులు పరమేష్ యాదవ్, ఐలేష్ యాదవ్, ప్రమోద్ గౌడ్, కాలనీల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
