కొడంగల్‌లో గ్రామీణ మహిళా సాధికారతపై క్లస్టర్ స్థాయి వర్క్‌షాప్
Know Your Money – Pragati Sakhi’ కార్యక్రమం విజయవంతం. ముఖ్య అతిథులుగా DCCB బ్యాంక్ DGM దమయంతి కొడంగల్ DCCB బ్రాంచ్ మేనేజర్ రవికుమార్
By Ram Reddy
On
లోకల్ గైడ్ : కొడంగల్, వికారాబాద్ జిల్లా:
గ్రామీణ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడంతో పాటు డిజిటల్ లావాదేవీలపై అవగాహన కల్పించేందుకు ‘Know Your Money – Pragati Sakhi’ కార్యక్రమంలో భాగంగా కొడంగల్ క్లస్టర్‌లో క్లస్టర్ స్థాయి వర్క్‌షాప్ ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమం HDFC Securities Limited వారి CSR సహకారంతో, Access Livelihoods సంస్థ భాగస్వామ్యంతో నిర్వహించబడింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా DCCB బ్యాంక్ DGM దమయంతి , కొడంగల్ DCCB బ్రాంచ్ మేనేజర్ రవికుమార్ హాజరయ్యారు.
గ్రామస్థాయి మార్పు: ప్రతి ప్రగతి సఖి తన గ్రామంలో ఇతర మహిళలకు శిక్షణ ఇవ్వడంతో పాటు మహిళా వ్యాపారవేత్తలకు మార్గదర్శకత్వం అందిస్తుంది.
భవిష్యత్ లక్ష్యం: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాన్ని విస్తరించి సుమారు 6.4 లక్షల మంది కమ్యూనిటీ సభ్యులకు అవగాహన కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
నిర్వాహకులు:
కొడంగల్ క్లస్టర్ మేనేజర్ యశస్వి చింత పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రగతి సఖీలు బి. రక్షిణి, ఉషారాణి, వెంకటమ్మ, సంగీత, స్వాతి, సరోజ, శిరీష, అఖిల, అనసూయ పాల్గొన్నారు.
పాల్గొన్న గ్రామాలు:
గ్రామీణ మహిళలు మహాస్వాద్, ఉడిమేశ్వరం, చిట్లపల్లి, దౌలతాబాద్, కౌడీడ్, కుదురుమళ్ల, పెద్దనందిగ్రాం, పర్కాపూర్, రుద్రారం, చంద్రకల్, రవులపల్లి, గోకఫస్లావాడ, పోల్కంపల్లి, బలంపేట, ఎర్లపల్లి, అంగడి రాయచూర్ తదితర గ్రామాల నుండి పెద్ద ఎత్తున హాజరయ్యారు.
బ్యాంకింగ్ వ్యవస్థపై అవగాహన పెంపు, డిజిటల్ భద్రతపై జాగ్రత్తలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు చేరేలా చేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని నిర్వాహకులు తెలిపారు. గ్రామీణ మహిళల నాయకత్వంలో ఆర్థిక భద్రత కలిగిన గ్రామాల నిర్మాణమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
Tags:
About The Author
Latest News
01 Apr 2026 18:51:09
*
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి ఏప్రిల్01లోకల్ గైడ్
వరంగల్ రామన్నపేట లోని డాక్టర్.ఏ. రాజేంద్రప్రసాద్ భారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పోతన ఆడిటోరియంలో ప్రదర్శించబడిన పూరి...
