ప్రియుడి మోజులో పడి కన్నా తల్లిదండ్రులనే కడతీర్చిన కూతురు.

పోలీసులు మూడు రోజుల్లోనే కేసును చేదించారు.

ప్రియుడి మోజులో పడి కన్నా తల్లిదండ్రులనే కడతీర్చిన కూతురు.

లోకల్ గైడ్/బంట్వారం:
 ఇంస్టాగ్రామ్ లో పరిచయమైన ప్రియుడి కోసం కూతురు కన్న తల్లిదండ్రులని హత్య చేసిన ఘటన వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం యాచారం గ్రామంలో చోటుచేసుకుంది.శనివారం 24వ తారీకు రాత్రి జరిగిన ఈ ఘటన పట్ల ఆదివారం అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న బంట్వారం పోలీసులు మూడు రోజుల్లోనే కేసును చేదించారు.ఈ కేసు పట్ల బుధవారం డిఎస్పి కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన వికారాబాద్ డిఎస్పి శ్రీనివాస్ రెడ్డి కేసు వివరాలు మీడియాకు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..బంట్వరం మండలం యాచారం గ్రామానికి చెందిన నక్కలి దశరథ్ 59 నక్కలి లక్ష్మి 52 భార్యాభర్తలు ఇద్దరు ఒకేసారి అనుమానస్పదంగా మృతి చెందడంతో ఆదివారం  వారి కొడుకు నక్కల అశోక్ ఫిర్యాదు,మేరకు కేసు నమోదు చేసుకొని ధరూర్ సిఐ రఘురాములు, బంట్వరం ఎస్సై విమల ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ క్రమంలో రక్తంతో కూడిన రెండు ఇంజక్షన్లు కనిపించడంతో అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుని ఉంటారని ముందు అనుమానం వచ్చినా మృతుల చిన్న కూతురు సురేఖ ప్రవర్తన పట్ల పోలీసులకు అనుమానం కలిగింది. దాంతో వారి స్టైల్ లో విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడింది. నిజానికి మృతులకు నలుగురు సంతానం కాగా అందులో ముగ్గురు ఆడపిల్లలు ఒక కుమారుడు అశోక్ ఉన్నారు. అశోక్ తో పాటు ఇద్దరు ఆడపిల్లలకు పెళ్లిళ్లు అయిపోగా సురేఖకు ఇంకా పెళ్లి కాలేదు.
*ఓవర్డోస్ మత్తు ఇంజక్షన్ ఇచ్చి హత్య..*
అశోక్ వ్యాపారం నిమిత్తం బంట్వారం నివాసం ఉండగా మృతులు చిన్న కూతురు సురేఖతో కలిసి పొలం పనులు చేసుకుంటూ గ్రామంలో నివాసం ఉంటున్నారు.సురేఖ సంగారెడ్డి లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తుంది,ఈ క్రమంలో సోషల్ మీడియాలో పరిచయమైన ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులకు చాలాసార్లు చెప్పగా వారు అందుకు నిరాకరించారు,దీంతో ఎలాగైనా తల్లిదండ్రులను హత్య చేయాలని భావించిన సురేఖ శనివారం రాత్రి భోజనం చేసిన తర్వాత అమ్మ నీకు ఒళ్ళు నొప్పులు అంటున్నావు కదా మా డాక్టర్ను అడిగి నీకు ఒక ఇంజక్షన్ తీసుకొచ్చాను అని చెప్పి తల్లి లక్ష్మికి మత్తు ఇంజక్షన్ ఎక్కువ డోస్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత బయట నుంచి వచ్చిన తండ్రి అమ్మ గురించి ఆరా తీయగా అమ్మకు ఒళ్ళు నొప్పులు ఉన్నాయి కదా అని మా డాక్టర్ను అడిగి మత్తు ఇంజక్షన్ ఇచ్చాను,అందుకే నిద్ర పోయింది అని చెప్పింది. తర్వాత నీకు కూడా నడుము నొప్పులు నొప్పులు ఉన్నాయి కదా నీకు కూడా ఒక ఇంజక్షన్ ఇస్తాను అని చెప్పి తండ్రి దశరథ కూడా మరో ఇంజక్షన్ ఇవ్వడం జరిగింది. వారు మృతి చెందారని నిర్ధారించుకున్న తర్వాత ఏడవడంతో గ్రామంలో చుట్టుపక్కల వారు వచ్చారు ఈ క్రమంలో మర్పల్లి ఆసుపత్రి తరలించగా అప్పటికే మృతి చెందారని డాక్టర్లు నిర్ధారించారు. ఈ సంఘటన పట్ల ఆదివారం పోలీసులకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా కన్న కూతురే కసాయిగా మారి తల్లిదండ్రులను చంపేసినట్లు పోలీసులు నిర్ధారించారు. మూడు రోజుల్లోనే కేసును చేదించిన  ధరూర్ సిఐ,రఘు రాములు,ఎస్ఐ విమలను డిఎస్పి శ్రీనివాస్ రెడ్డి అభినందించారు.

Tags:

About The Author

Latest News

ఎన్నికల సంఘం కార్యాలయాన్ని సందర్శించి మెమోరాండం సమర్పించిన           ఎన్నికల సంఘం కార్యాలయాన్ని సందర్శించి మెమోరాండం సమర్పించిన          
కుత్బుల్లాపూర్ ఫిబ్రవరి 10 (లోకల్ గైడ్ ప్రతినిధి)  జిల్లాల నుండి పనిచేసే ఉద్దేశ్యంతో హైదరాబాద్‌లో నివసిస్తున్న అనేక మంది ఓటర్లను మేము గమనించాము.  వారు తమ ఓటు...
12న బెల్లంపల్లిలో బాడీ బిల్డింగ్ పోటీలు....
జిల్లాలోని మున్సిపల్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన డిసిపి. 
శివరాంపల్లి పిల్లర్ నెంబర్ 274 వద్ద  ట్రాఫిక్ సమస్య పరిష్కరించండి.                                                                
నూతన గుడి నిర్మాణానికి విరాళం
రవాణా రంగా పరిరక్షణ కార్మిక హక్కులకై జరిగే జాతీయ సమ్మె జయప్రదం చేయండి..
ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ జరుగుతోంది.. బాధ్యులపై ఉక్కుపాదం తప్పదు