పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహణ .

2వ సాధారణ మున్సిపల్ ఎన్నికల నిర్వహణ

పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహణ .

    రంగారెడ్డి జిల్లా బ్యూరో,(లోకల్ గైడ్ ):                          పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేసినట్లు               జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి  తెలిపారు.
         2వ సాధారణ మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా బుధవారం పోలింగ్ సిబ్బంది కి మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సి.నారాయణ రెడ్డి  పోలింగ్ సిబ్బంది రనేతృత్వంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని మినీ కాన్ఫరెన్స్  హాల్ లో ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహించారు. రంగారెడ్డి జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల పరిధిలో గల పోలింగ్ కేంద్రాలలో ఎన్నికల విధులు నిర్వర్తించే ప్రిసైడింగ్ అధికారులు (పీ.ఓ), సహాయ ప్రిసైడింగ్ అధికారులు (ఏ.పీ.ఓ)లను, ఇతర పోలింగ్ అధికారులు (ఓ.పీ.ఓ)లను ర్యాండమైజెషన్ ద్వారా కేటాయించారు. పోలింగ్ సిబ్బందికి ఎంపిక చేసిన వివిధ కేంద్రాలలో మాస్టర్ ట్రైనర్స్ చే పోలింగ్ నిర్వహణపై శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకొని పోలింగ్ విధుల కోసం నియమించబడిన సిబ్బందికి తక్షణమే ఉత్తర్వులతో అందజేయాలని అధికారులను ఆదేశించారు. 
ఈ ర్యాండమైజేషన్ ప్రక్రియలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, జెడ్పీ సీఈఓ కృష్ణరెడ్డి, మ్యాన్ పవర్ మ్యానేజ్మెంట్ నోడల్ అధికారి శ్రీలక్ష్మి, పిడి హౌసింగ్ చాంప్లా నాయక్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News