నిజాలు రాసినందుకే రిపోర్టర్‌పై బెదిరింపులు
రిపోర్టర్ రాయల నరసింహ మిడ్జిల్ పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు
By Ram Reddy
On
నిజాలను నిర్భయంగా వెలుగులోకి తెచ్చినందుకు ప్రజా ప్రతిభ రిపోర్టర్ రాయల నరసింహపై అక్రమ కేసులు బనాయిస్తూ, చంపుతానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని జడ్చర్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ జ్యోతి అలవాల్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
తనకు ప్రాణహాని ఉందని పేర్కొంటూ రిపోర్టర్ రాయల నరసింహ మిడ్జిల్ పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. ప్రజాస్వామ్యంలో నాలుగో స్థంభంగా ఉన్న మీడియాను భయపెట్టే ప్రయత్నాలు సహించరాదని ఆయన స్పష్టం చేశారు.
నిజాలు రాస్తే ప్రాణహానీ బెదిరింపులా? అంటూ జర్నలిస్టు సంఘాలు, ప్రజాసంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Tags:
About The Author
Latest News
09 Feb 2026 20:59:17
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సహకారంతో భారీగా నిధులతో అభివృద్ధి 21వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి రమ్య జ్యోతి శ్రీకాంత్ ను గెలిపించండి.
