ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” పేరి 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక
మార్చి 6 నుంచి జూన్ 12 వరకు అమలులో ఉండే ఈ కార్యాచరణలో నగర అభివృద్ధి పనులు,
ఖమ్మం :లోకల్ గైడ్ :
ఖమ్మం నగరపాలక సంస్థలో “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” పేరి 99 రోజుల కార్యాచరణ ప్రణాళికను నగర మేయర్ శ్రీమతి పునుకొల్లు నీరజ గారు మరియు ఉప కమిషనర్ ప్రారంభించారు. మార్చి 6 నుంచి జూన్ 12 వరకు అమలులో ఉండే ఈ కార్యాచరణలో నగర అభివృద్ధి పనులు, పారిశుద్ధ్యం, తాగునీరు, రహదారులు, మౌలిక వసతుల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది సమన్వయంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని మేయర్ సూచించారు. నగర అభివృద్ధి వేగవంతం చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యమని తెలిపారు. నగరంలోని 26వ డివిజన్ ప్రధాన రహదారిలోని మసీదు ప్రాంతం లో, క్రైమ్ పోలీస్ స్టేషన్ ప్రాంతం లో జరుగుతున్న పారిశుధ్య పనులను పరిశీలించారు. డివిజన్లో విద్యుత్ స్తంభాలు ఎక్కడపడితే అక్కడ నిరుపయోగంగా పడి ఉన్నాయి సంబంధిత విద్యుత్ అధికారులకు పలు సూచనలు చేశారు.
అలాగే మరుగుదొడ్లు ఎప్పుడు తాళాలు వేసి ఉండటం దానికి సంబంధిత గుత్తేదారిని పిలిచి ప్రజా ప్రజల సౌకర్యానికి అందుబాటులో ఉండే విధంగా ఉండాలని షాపు రెంట్ పర్పస్ వాడుకోవాలని అధికారులతో చర్చించారు.
కార్యక్రమంలో వారితోపాటు ఉప కమిషనర్ శ్రీనివాస్ సహాయ కమిషనర్, అనిల్ కుమార్, ఎన్రోల్మెంట్ ఏఈ శ్రీనివాస్, గోళ్ళ వెంకట్, వడ్డే బోయిన శీను,
ఎస్సై మల్లయ్య, జవాన్ రాజు, ఆనంద్, బుజ్జి, రజిని ప్రసాద్, ముఖేష్, మదర్ , అస్లాం తదితరులు పాల్గొన్నారు.
