ఉపాధి,పారిశుద్ధ్యం,నీటి ఎద్దడికి ప్రాధాన్యత

ఉపాధి,పారిశుద్ధ్యం,నీటి ఎద్దడికి ప్రాధాన్యత

నారాయణపేట మార్చి 5:

గ్రామంలో ఉపాధి హామీ కింద ప్రజలకు ఉపాధి, పారిశుధ్యం, తాగునీటి సమస్యలకు ప్రాధాన్యం కల్పిస్తున్నట్లు మాగనూర్ మండలం  అడివి సత్యారం గ్రామ సర్పంచ్ ఆనందమ్మ అన్నారు.గురువారం సర్పంచ్ ఆనందమ్మ  అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. గ్రామసభ లో ఏపీవో మన్యం  మాట్లాడుతూ ఈ వేసవి కాలంలో ఉపాధి హామీ కూలీ లు కాలువల పూడికతీత పనులు, పండ్ల తోటల పెంప కం పనులు చేసి లబ్ధి పొందా లని అన్నారు.పనులకు హాజ రయ్యే ప్రతి కూలీనీ ఫీల్డ్ అసి స్టెంట్ పని ప్రదేశం లో ఫోటో తీసి యాప్ లో అప్లోడ్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. కొలతల ప్రకారం పని చేస్తే రోజు కి  307 రూపా యలు ప్రభుత్వం చెల్లిస్తుంద న్నారు. పంచాయతీ కార్యద ర్శి,సర్పంచ్ ఆనందమ్మ, కార్యదర్శి ఏడుకొండలు  మాట్లాడుతూ  100 శాతం టాక్స్ కట్టాలని, పరిశుభ్రత పాటించాలని, అందరు మరు గు దొడ్లు నిర్మించుకుని స్వచ్ఛ గ్రామం గా చేసుకుందామని అందుకు అందరు సహకరిం చాల్సిందిగా విజ్ఞప్తి చేశా రు.ఈ గ్రామ సభలో ఉప సర్పంచ్ హుస్సేన్ గౌడ్, ఫీల్డ్ అసిస్టెంట్ నవకాంత్ రెడ్డి, వార్డు సభ్యులు పావని, పల్లవి , లక్ష్మీ,  మాజీ ఉప సర్పంచ్ నర్సింహ రెడ్డి, కుమ్మరి వీరేశ్, గోవింద రెడ్డి, వెంకట్ రెడ్డి,గ్రామ ప్రజలు, యువకులు, ఉపాధి కూలీలు హాజరయ్యారు.
ఫోటో రైట్ అప్:5:అడవి సత్యారంలో నిర్వహించిన గ్రామ సభ
______________________

Tags:

About The Author

Latest News

నాణ్యమైన వస్తువులు సరసమైన ధరలకు నల్లగొండ ప్రజలకు నాణ్యమైన వస్తువులు సరసమైన ధరలకు నల్లగొండ ప్రజలకు
    నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి:మార్చి 16 (లోకల్ గైడ్) నల్లగొండ పట్టణ ప్రజలకు నాణ్యమైన వస్తువులు, సరుకులు సరసమైన ధరలకు అందించి ప్రజల మన్ననలు పొందాలని
అభివృద్ధి పనులకు భూ కేటాయింపు త్వరితగతిన పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్
తమ్ముడి మృతికి కారణమైన అన్న అరెస్టు.
సీపీఐ(ఎం) పార్టీ నాయకురాలు మాడె సుభద్ర మృతి
పెండింగ్‌లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి బాధ్యతగా విధులు నిర్వర్తించాలి :
అసెంబ్లీ సమావేశాల్లో " ఆశవర్కర్స్ "సమస్యల గురించి చర్చించాలి
ప్రజావాణిలో వచ్చిన వినతులను సత్వర పరిష్కారం చేయాలి: