రూ.4 లక్షల సబ్సిడీతో వ్యవసాయ డ్రోన్లు..

మధిర సహాయ వ్యవసాయ సంచాలకులు ఎస్.విజయ చంద్ర

రూ.4 లక్షల సబ్సిడీతో వ్యవసాయ డ్రోన్లు..

మధిర, మార్చి 05  లోకల్ గైడ్ :
తెలంగాణ  ప్రభుత్వం వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే కాకుండా,సాగులో లేటెస్ట్ టెక్నాలజీని ప్రవేశపెట్టేందుకు డ్రోన్లను 40% సబ్సిడీ తో ఇచ్చుటకు నిర్ణయించడం జరిగింది.రైతులకు శ్రమ తగ్గించి,దిగుబడి పెంచడమే ఈ పథకం వెనుక ఉన్న లక్ష్యం.ఒక్కో డ్రోన్ కొనుగోలుపై 40% శాతం సబ్సిడీ లేదా గరిష్టంగా రూ.4 లక్షల వరకు రాయితీ ఇవ్వనున్నారు.ఈ పథకంలో  మొదటి విడతలో భాగంగా *మధిర డివిజన్ లో రెండు డ్రోన్లను* సబ్సిడీ మీద ఇవ్వడం జరుగుతుంది.నేరుగా రైతులకే కాకుండా,రైతు ఉత్పత్తిదారుల సంఘాలు,ప్రాథమిక సహకార సంఘాలకు, మహిళా సంఘాలకు,మంజూరు చేయడం జరుగుతుంది.వ్యవసాయంలో డ్రోన్ల తో పొలాల్లో పురుగు మందులు,సూక్ష్మ పోషకాలను పిచికారీ చేయడానికి కేవలం నిమిషాల్లోనే ఆ పని పూర్తి చేయవచ్చు.దీనివల్ల సమయం దాదాపు 80% శాతం వరకు ఆదా అవుతుంది. అంతేకాకుండా,మందులు పంట అంతటా సమానంగా పడటం వల్ల పురుగుల ఉధృతి తగ్గి దిగుబడి పెరుగుతుంది.కూలీల కోసం వెతకాల్సిన అవసరం లేకుండా,ఖర్చు కూడా భారీగా తగ్గుతుంది.ఈ పథకం కింద లబ్ధి పొందలనుకునే రైతులు తమ మండల వ్యవసాయ అధికారి మరియు వ్యవసాయ విస్తరణ అధికారి  కార్యాలయాల్లో సంప్రదించి దరఖాస్తు చెయ్యవచ్చు.అక్కడ సబ్సిడీ శాతం,అర్హతలు, దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు అందుబాటులో ఉంటాయి.వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులకు మంజూరు చేయబడును...

Tags:

About The Author

Latest News

నాణ్యమైన వస్తువులు సరసమైన ధరలకు నల్లగొండ ప్రజలకు నాణ్యమైన వస్తువులు సరసమైన ధరలకు నల్లగొండ ప్రజలకు
    నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి:మార్చి 16 (లోకల్ గైడ్) నల్లగొండ పట్టణ ప్రజలకు నాణ్యమైన వస్తువులు, సరుకులు సరసమైన ధరలకు అందించి ప్రజల మన్ననలు పొందాలని
అభివృద్ధి పనులకు భూ కేటాయింపు త్వరితగతిన పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్
తమ్ముడి మృతికి కారణమైన అన్న అరెస్టు.
సీపీఐ(ఎం) పార్టీ నాయకురాలు మాడె సుభద్ర మృతి
పెండింగ్‌లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి బాధ్యతగా విధులు నిర్వర్తించాలి :
అసెంబ్లీ సమావేశాల్లో " ఆశవర్కర్స్ "సమస్యల గురించి చర్చించాలి
ప్రజావాణిలో వచ్చిన వినతులను సత్వర పరిష్కారం చేయాలి: