అసెంబ్లీ సమావేశాల్లో " ఆశవర్కర్స్ "సమస్యల గురించి చర్చించాలి

ఆశ వర్కర్స్ తో నిరసన తెలియజేసి మెడికల్ ఆఫీసర్ కి వినతి పత్రం సమర్పించారు.

అసెంబ్లీ సమావేశాల్లో

 

 

 

ఖమ్మం జిల్లా, కారేపల్లి : లోకల్ గైడ్, మార్చి 16 :

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ఆశా వర్కర్ సమస్యల పై చర్చించాలని సి ఐ టి యు సింగరేణి మండల కన్వీనర్ కే. నరేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం కారేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో ఆశ వర్కర్స్ తో నిరసన తెలియజేసి మెడికల్ ఆఫీసర్ కి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కే. నరేంద్ర మాట్లాడుతూ ఆశా వర్కర్స్ కి నేలకు 18, 000 / వేల రూపాయల ఫిక్స్డ్ వేతనం చెల్లించాలని , కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు కనీస వేతనాన్ని అమలు చేయాలని, ఆశ వర్కర్స్ కి రిటైర్మెంట్ బెనిఫిట్స్ చట్టం చేయాలని, ఇన్సూరెన్స్ , పి ఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని, నాలుగు లేబర్ కోడ్ బిల్లులు ను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయబోమని అసెంబ్లీలో తీర్మానం చేయాలని, ఆశా వర్కర్స్ ను పర్మినెంట్ చేయాలని , ఆశా వర్కర్స్ పై వేధింపులు ఆపి , ఉద్యోగ భద్రత కల్పించాలని కే. నరేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించాడు . రేపు కలెక్టరేట్ ముందు జరిగే ధర్నా , ఈ నెల 26 వ తేదీన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు . ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకురాలు ఎల్లబోయిన రాధ , మండల అధ్యక్ష కార్యదర్శులు వాంకుడోత్ కమల , ఎన్. పద్మ , కళ్యాణి , సరస్వతి , చంద్రమ్మ , నాగలక్ష్మి , దేవ కరుణ , వీ . నాగమ్మ , ఆర్ . పద్మ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

నాణ్యమైన వస్తువులు సరసమైన ధరలకు నల్లగొండ ప్రజలకు నాణ్యమైన వస్తువులు సరసమైన ధరలకు నల్లగొండ ప్రజలకు
    నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి:మార్చి 16 (లోకల్ గైడ్) నల్లగొండ పట్టణ ప్రజలకు నాణ్యమైన వస్తువులు, సరుకులు సరసమైన ధరలకు అందించి ప్రజల మన్ననలు పొందాలని
అభివృద్ధి పనులకు భూ కేటాయింపు త్వరితగతిన పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్
తమ్ముడి మృతికి కారణమైన అన్న అరెస్టు.
సీపీఐ(ఎం) పార్టీ నాయకురాలు మాడె సుభద్ర మృతి
పెండింగ్‌లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి బాధ్యతగా విధులు నిర్వర్తించాలి :
అసెంబ్లీ సమావేశాల్లో " ఆశవర్కర్స్ "సమస్యల గురించి చర్చించాలి
ప్రజావాణిలో వచ్చిన వినతులను సత్వర పరిష్కారం చేయాలి: