ఖమ్మం మున్సిపాలిటీల్లోనూ కాంగ్రెస్ జోరు

డీసీసీ కార్యాలయంలో సంబరాలు

ఖమ్మం మున్సిపాలిటీల్లోనూ కాంగ్రెస్ జోరు

ముఖ్య అతిథులుగా అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్

 (ఖమ్మం: లోకల్ గైడ్ )

డీసీసీ కార్యాలయంలో సంబరాలు

ముఖ్య అతిథులుగా అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్

రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీ ఎన్నికల్లోనూ ప్రజలు కాంగ్రెస్ కే పట్టం కట్టారని అందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయం కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో నూతి సత్యనారాయణ గౌడ్ నగర కాంగ్రెస్ కమిటి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు,శాసనసభ మాజి సభ్యులు కొండబాల కోటేశ్వరరావు,పి సి సి సభ్యులు పుచ్చకాయల వీరభద్రం, జిల్లా ఆర్ టి ఏ మెంబర్ గజ్జెల్లి వెంకన్న,జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, జిల్లా సేవాదళ్ అద్యక్షులు సయ్యద్ గౌస్, జిల్లా మైనారిటీ అద్యక్షులు సయ్యద్ ముజాహిద్ హుస్సేన్, మొక్క శేఖర్ గౌడ్,కార్పొరేటర్లు రాపర్తి శరత్,మిక్కిలినేని మంజుల నరేంద్ర, జిల్లా కాంగ్రెస్ నాయకులు కిలారి అనిల్ కుమార్,కిలారి వెంకటరమణ, రాష్ట్ర యువజన కాంగ్రెస్ కార్యదర్శి జెర్రిపోతుల అంజనీ కుమార్ మరియు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ప్రజాపాలన గావిస్తూ అమలు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి బలంగా నాటకపోయాయని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పని అయిపోయిందని కారు కూతలు కూస్తున్న ప్రతిపక్ష నేతలకు నాయకులకు ఈ ఎన్నిక ఒక చెంపపెట్టువంటిదని అన్నారు. జిల్లాలో ముగ్గురు మంత్రుల పర్యవేక్షణలో ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయి వరకు తీసుకెళ్లగలిగామని అన్నారు. గ్రామాలే కాకుండా పట్టణాల్లోనూ కాంగ్రెస్ ఆదిపత్యమే నడుస్తుందని ప్రతిపక్ష పార్టీలు ఇది గమనించి అభివృద్ధికి సలహాలు సూచనలు ఇవ్వాలని కోరారు.

ఈ కార్యక్రమంలో వీరితో పాటు జిల్లా ఓబీసీ సెల్ ఉపాద్యక్షులు గజ్జి సూర్యనారాయణ, నగర ఓ బి సి సెల్ అద్యక్షులు బాణాల లక్ష్మణ్,విప్లవ కుమార్, ముక్రం,వాసిం, ఫరీద్ ఖాద్రి, బచ్చలకూరి నాగరాజు, వీరయ్య గౌడ్, బొమ్మ ఉదయ్, కిరణ్, బెజ్జం గంగాధర్,ప్రతిభారెడ్డి,చంద్రిక, లక్ష్మీ, మంగ, సుగుణ భవాని,నీలవేణి తదితర నాయకులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

బిజెపి రాష్ట్ర నాయకులు విగ్రహ దాత పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి బిజెపి రాష్ట్ర నాయకులు విగ్రహ దాత పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి
శక్తి స్వరూపుడు శివాజీ మహారాజ్   *శివాజీస్ఫూర్తితో యువత ముందుకు సాగాలి*   *డాక్టర్ :శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామీ*   *ప్రతి గ్రామంలో హైందవ చైతన్యం రావాలి*...
ఖమ్మం మున్సిపాలిటీల్లోనూ కాంగ్రెస్ జోరు
తాండూర్ బల్దియాపీఠం అధికార పార్టీదే
విద్యార్థులు ఆత్మస్ధైర్యంతో ముందుకెళ్లాలి. 
నాటు సార విక్రేత అరెస్టు.
అతివేగంతో ఆటోను ఢీ కొట్టిన బైక్.
నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలి.