నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలి.
ఉపాధి చట్టం నిర్వియానికి కేంద్రం కుట్ర.
కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా భారీ నిరసన. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కే శ్రీనివాస్.
లోకల్ గైడ్/ తాండూర్:
నాలుగు కార్మికుల వ్యతిరేక లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కే శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గురువారం సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘాల ఆధ్వర్యంలో తాండూర్ పట్టణంలోని దొడ్డి కొమరయ్య పార్క్ నుండి భద్రేశ్వర చౌకు గాంధీ చౌక్, వినాయక చౌక్... గుండా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు భారీగా ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు, కెవిపిఎస్ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మాట్లాడుతూ... కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అత్యంత ప్రమాదకరమైన నాలుగు కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ లు తెచ్చి, కార్మిక వర్గంపై యుద్ధం చేస్తుందని మండిపడ్డారు. అంతే కాక వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగాన్ని దివాలా తీసేలా చేశారని వ్యాఖ్యానించారు.కార్మికులను కట్టు బానిసలుగా మార్చడానికి, ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటీకరించడానికి, బ్యాంకులను కుదించడం, ఇన్సూరెన్స్ రంగంలో విదేశీ బహుళ జాతి కంపెనీలను ఆహ్వానించి దేశ సంపాదన మొత్తం విదేశాలకు కట్టబెట్టడానికి, ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆక్షేపించారు. పని గంటలను పెంచడం, కనీస వేతనాలు లేకుండా యాజమాన్యాలు మోసం చేస్తున్నాయి.నాడు బ్రిటిష్ ప్రభుత్వమిచ్చిన పోరాడే హక్కులు ,భేరసారాల హక్కులు, సమ్మె హక్కు, సంగం పెట్టుకునే హక్కును కాల రాస్తున్నారని ఆరోపించారు. తక్షణమే 14 గంటల పని దినాలను రద్దు చేయాలని, ఎనిమిది గంటల పని దినాలను కల్పించి కార్మికులకు ఈఎస్ఐపిఎఫ్ ,కనీస వేతనం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు బాలమణి, కోశాధికారి బేబీ, సహాయ కార్యదర్శి రామంజమ్మ, అంగన్వాడీ టీచర్స్ మణిమాల, జయంతి, భాగ్యలక్ష్మి, సుధారాణి, అంజమ్మ, పద్మ, మున్సిపల్ కార్మికుల యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ నరేష్ బలరాం, అశోక్, నర్సింలు, గ్రామపంచాయతీ యూనియన్ నాయకులు నర్సింలు, వెంకటేష్ జిలాని, లక్ష్మీ బిచ్చప్ప, తదితరులు పాల్గొన్నారు.
