బిజెపి రాష్ట్ర నాయకులు విగ్రహ దాత పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి
శక్తి స్వరూపుడు శివాజీ మహారాజ్
*శివాజీస్ఫూర్తితో యువత ముందుకు సాగాలి*
*డాక్టర్ :శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామీ*
*ప్రతి గ్రామంలో హైందవ చైతన్యం రావాలి*
*డాక్టర్: బాస్కర యోగి*
*హిందూ ధర్మాన్ని రక్షించిన మహానీయుడుఛత్రపతి శివాజీ*
( లోకల్ గైడ్ షాద్ నగర్)
కొందుర్గు మండలం ఉత్తరాస్
పల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ నూతన విగ్రహ ఆవిష్కరణ చేయడం జరిగింది.
ఈయొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామీ గారు, కవి రచయత డాక్టర్ : బాస్కర్ యోగిగారు బిజెపి రాష్ట్ర నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి, అందే బాబయ్య, నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి, పాల్గొనడం జరిగింది.
స్వామీజీ చేతుల మీదుగా ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం ఆవిష్కరించడం జరిగింది.
స్వామీజీ గారు మాట్లాడుతూ
ఛత్రపతి శివాజీ ఒక వ్యక్తి కాదు శక్తి స్వరూపుడు అని అన్నారు.
శివాజీ స్ఫూర్తి తో యువత ముందుకు సాగాలని అన్నారు.
అయన ఆశయాలను ప్రతి గ్రామ గ్రామాన తీసుకెళ్లాలని అన్నారు.
బాస్కర్ యోగి గారు మాట్లాడుతూ
ఉత్తరాస్ పల్లిలో వచ్చినట్టు ప్రతి గ్రామంలో హైందవ చైతన్యం రావాలని అన్నారు.
విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ
హిందూ ధర్మాన్ని రక్షించిన మహనీయులు ఛత్రపతి శివాజీ అని అన్నారు.
ఈ కార్యక్రమంలో అప్పోజు విజయ్ బాస్కర్ గురుస్వామి భూపాల చారి, మండల అధ్యక్షులు చిట్టెం లక్ష్మీకాంత్ రెడ్డి, మాణిక్ రెడ్డి, వివిధ మండలాల అధ్యక్షులు, శివాజీ యూత్ సభ్యులు, గ్రామస్థులు మరియు ఇతర గ్రామాల నుండి పెద్ద ఎత్తున యువత, మహిళలు పాల్గొన్నారు..
