పోలీస్ కమిషనర్ కార్యాలయం ఖమ్మం...
ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ఆంక్షలు.. మద్యం దుకాణాలు బంద్ : పోలీస్ కమిషనర్
ఖమ్మం,: లోకల్ గైడ్
ఓట్ల లెక్కింపు సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడకుండా ఉండేందుకు ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా కమిషనరేట్ పరిధిలో సెక్షన్ 163 BNSS విధించినట్లు వెల్లడించారు.
కౌంటింగ్ కేంద్రాల వద్ద నిషేధిత కర్రలు, లాఠీలు, పేలుడు పదార్ధాలు, ఆయుధాలతో తిరగడాన్ని నిషేధించారు. మైక్‌లు, మ్యూజిక్ సిస్టమ్, ప్రసంగాలు చేయడం, నిషేధిత ఫోటోలు, సింబల్స్, ప్లకార్డులు ప్రదర్శించకూడదని ఆదేశించారు. ఎలాంటి ర్యాలీలు, ధర్నాలు, బహిరంగ సభలు, సమావేశాలు నిషేధమని, ఐదు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడరాదని పేర్కొన్నారు. రోడ్లు మరియు బహిరంగ ప్రదేశాలలో గెలిచిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు, డీజేలు పెట్టుకోవడం,టపాసులు కాల్చడంపై నిషేధం విధించామని తెలిపారు. ఎవరైనా నిబంధనలు పాటించకుంటే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
విధి నిర్వహణలో ఉన్న పోలీసు, మిలటరీ, ఎలక్షన్ అధికారులకు ఈ ఆంక్షల నుంచి మినహాయింపు ఉంటుందన్నారు.
అదేవిదంగా ఓట్ల లెక్కింపు సందర్భంగా శుక్రవారం ఉదయం 8:00 గంటల నుండి ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యేవరకు ఖమ్మం జిల్లా పరిధిలోని ఏదులాపురం, మధిర, వైరా, సత్తుపల్లి, కల్లూరు మునిసిపాలిటీ కౌంటింగ్ సెంటర్ పరిధిలో వైన్ షాపులు, బార్లు, మద్యం సరఫరా చేసే రెస్టారెంట్లు, మూసివేయాలని ఆదేశించారు. ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా ముందస్తు చర్యలలో భాగంగా మూసివేయాలని సూచించారు. నిబంధనలు అతిక్రమించి ఎవరైనా మద్యం దుకాణాలు ఓపెన్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నిబంధనలు పాటిస్తూ కౌంటింగ్ ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని కోరారు.
