దానవాయిగూడెంలో ఇందిరమ్మ చీరల పంపిణీ
రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులకు అందజేసిన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి
ఖమ్మం :లోకల్ గైడ్ :
ఖమ్మం రూరల్* రాష్ట్ర ప్రభుత్వం మంజురుచేసిన ఇందిరమ్మ చీరలను ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి బుధవారం దానవాయిగూడెంలో రేషన్ కార్డులు ఉన్న లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా..రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయ ఇన్ చార్జ్ తుoబూరు దయాకర్ రెడ్డి తో కలిసి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు, ఇతర సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరేలా చూస్తోoదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొండల్ జన్మదినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మద్దులపల్లి మార్కెట్ చైర్మన్ హరినాధ బాబు, కార్పొరేటర్ లలితారాణి, చల్లా కృష్ణ, జంగం భాస్కర్, కృష్ణ గౌడ్, భట్టపోతుల కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
తల్లంపాడు వద్ద అమ్మ హోటల్ కు శ్రీకారం
తల్లంపాడు వద్ద ప్రధాన రహదారి వెంట నూతనంగా అమ్మ హోటల్ ఏర్పాటుకు భూమి పూజ కార్యక్రమం చేపట్టగా ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి హాజరై.. యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. నమ్మకం, నాణ్యతలో ఇప్పటికే పేరొందిన అమ్మ హోటల్.. ఇక్కడ కూడా అంతే విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు.
