ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మజ్జిగ పంపిణీ.

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మజ్జిగ పంపిణీ.

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి,ఏప్రిల్ 07  లోకల్ గైడ్ 

వరంగల్,రామన్నపేట లోని డాక్టర్.ఏ. రాజేంద్రప్రసాద్ భారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకొని ప్రభుత్వ ఆయుర్వేదిక్ వైద్యశాలలో ని రోగులకు మజ్జిగ పంపిణీ చేశారు. అనంతరం మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్.
ఏ.రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ కోట్ల రూపాయలు ఉన్నా కూడా ఆరోగ్యం సరిగా లేనప్పుడు జీవితం వృధానే అన్నారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని, బయటి ఆహార పదార్థములు ,జంక్ ఫుడ్స్, రోడ్లమీద తయారు చేసే వివిధ రకాలైన ఆహారాన్ని తిని అనారోగ్యం రాకుండా ఉండవలసిన బాధ్యత మనపైనే ఉందన్నారు. లిక్విడ్ టైప్ ఆహారం తీసుకోవడం అంటే జావా లాంటిది తేలికగా జీర్ణం కావడానికి కూరగాయలతో తిని ఆరోగ్యాన్ని సక్రమంగా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. చల్ల పంపిణీ చేసిన సందర్భంగా మాట్లాడుతూ చల్ల అనేది ప్రీ ప్రొ ప్రయాబిటీకి గా ఉపయోగపడుతూ మన జీర్ణాశయంలో ఉన్నటువంటి చెడు బ్యాక్టీరియాలను చంపి మనములను ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. అందులో భాగంగానే ఈరోజు ఆయుర్వేదశాలలో ఉన్నటువంటి అడ్మిట్ అయిన పేషెంట్లకు అందరికీ కొద్దిగా నైనా ఆరోగ్యంగా ఉంచడంలో భాగంగా మా వంతుగా పంపిణీ చేయడం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్ శ్రవణ్, సభ్యులు శైలజ, శ్రీనివాస్, నల్ల సత్యనారాయణ, డాక్టర్ హరి జ్యోతి, పులి రాజు ఆఫీస్ సూపర్డెంట్, త్రివేణి స్టాఫ్ నర్స్ మరి జూనియర్ వైద్యులందరూ పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మజ్జిగ పంపిణీ. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మజ్జిగ పంపిణీ.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి,ఏప్రిల్ 07  లోకల్ గైడ్  వరంగల్,రామన్నపేట లోని డాక్టర్.ఏ. రాజేంద్రప్రసాద్ భారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకొని ప్రభుత్వ...
భూసేకరణ పరిహారం పై తెర 
వసతి గృహాల్లో వంద శాతం ప్రవేశాలు కల్పించాలి.
వరల్డ్ హెల్త్ డే సందర్భంగా కొయ్యూరు పీహెచ్‌సీలో అవగాహన ర్యాలీ
ప్రజలకు నాణ్యమైన సేవలందించిన వైద్య సిబ్బందికి గౌరవం ప్రతిభకు పురస్కారాలు
ప్రమాదవశాత్తు చెరువులో పడి  విద్యార్థి మృతి....
జడ్చర్ల రూరల్ సీఐగా కే.మహేష్ బాధ్యతల స్వీకారం