భూసేకరణ పరిహారం పై తెర 

ఎకరాకు 18.50 లక్షలు కోరుతున్న రైతులు

భూసేకరణ పరిహారం పై తెర 

ఎమ్మెల్యే చొరవతో చర్చలు వేగం

 

-

ఖమ్మం జిల్లా,కారేపల్లి:లోకల్ గైడ్, ఏప్రిల్ 07 :

రైల్వే డబుల్ లైన్ భూసేకరణలో రైతులకు గరిష్ట పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ కోరారు. రైతులకు అన్యాయం జరగకుండా త్వరగా అవార్డు ఖరారు చేయాలని సూచించారు. సింగరేణి మండల పరిధిలో డోర్నకల్ నుంచి భద్రాచలం రోడ్ వరకు ప్రతిపాదించిన ప్రాజెక్టులో కోమట్లగూడెం గేట్, కారేపల్లి, కమలాపురం ప్రాంతాల రైతుల భూములు సేకరిస్తున్నారు. పరిహారం అంశంపై ఇటీవల కలెక్టర్ కార్యాలయంలో సమావేశం జరిగింది. రైతులు ఎకరాకు 19 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయగా అధికారులు 18 లక్షల వరకు ఇవ్వవచ్చని తెలిపారు. ఎకరాకు 18.50 లక్షలు ఇస్తేనే భూములు ఇస్తామని రైతులు తమ నిర్ణయాన్ని తెలియజేశారు. ఈ మేరకు జాయింట్ కలెక్టర్ శ్రీజకు వినతిపత్రం సమర్పించారు. సమస్య పరిష్కారానికి ఎమ్మెల్యే చొరవ తీసుకుని కలెక్టర్‌తో మాట్లాడారు. గాదెపాడు సర్పంచ్ భూక్యా రంజిత్ కుమార్ నేతృత్వంలో రైతులు జాయింట్ కలెక్టర్‌ను కలిశారు. మరోసారి సమావేశం నిర్వహించి అధికారికంగా పరిహారం ప్రకటించాలని కోరారు. కమలాపురానికి చెందిన కోటి అప్పారావు, పాండియా నాయక్, మహిళా రైతులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే చొరవతో పరిహారం పెంపుపై సానుకూల నిర్ణయం వస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Tags:

About The Author

Latest News

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మజ్జిగ పంపిణీ. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మజ్జిగ పంపిణీ.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి,ఏప్రిల్ 07  లోకల్ గైడ్  వరంగల్,రామన్నపేట లోని డాక్టర్.ఏ. రాజేంద్రప్రసాద్ భారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకొని ప్రభుత్వ...
భూసేకరణ పరిహారం పై తెర 
వసతి గృహాల్లో వంద శాతం ప్రవేశాలు కల్పించాలి.
వరల్డ్ హెల్త్ డే సందర్భంగా కొయ్యూరు పీహెచ్‌సీలో అవగాహన ర్యాలీ
ప్రజలకు నాణ్యమైన సేవలందించిన వైద్య సిబ్బందికి గౌరవం ప్రతిభకు పురస్కారాలు
ప్రమాదవశాత్తు చెరువులో పడి  విద్యార్థి మృతి....
జడ్చర్ల రూరల్ సీఐగా కే.మహేష్ బాధ్యతల స్వీకారం