తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌లో భారీ చేరికలు
కేటీఆర్ సమక్షంలో సానే విజయ్ రెడ్డి పార్టీలోకి
శేరిలింగంపల్లి, (లోకల్ గైడ్ వెస్ట్ జోన్ స్టాఫ్ రిపోర్టర్ కృష్ణ): తెలంగాణ భవన్‌లో కుకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరాం కృష్ణారావు నాయకత్వంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మారబోయిన రవి యాదవ్ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం శ్రీరామ్ నగర్ డివిజన్‌కు చెందిన సానే విజయ్ రెడ్డి తన అనుచరులు, కార్యకర్తలతో కలిసి కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) విజయ్ రెడ్డికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలకు స్వాగతం పలికి, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ పార్టీల పలువురు కీలక నాయకులు కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరడం విశేషం. ప్రజలు కాంగ్రెస్, బీజేపీ పార్టీల వైఫల్యాలను తిరస్కరిస్తూ బీఆర్‌ఎస్ పార్టీపై విశ్వాసం ఉంచుతున్నారనే దానికి ఈ భారీ చేరికలు నిదర్శనమని నాయకులు పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఎగిరేది గులాబీ జెండానే… ఎమ్మెల్యేలు పార్టీని వదిలి వెళ్లినా క్యాడర్ అంతా కేసీఆర్ వెంటే ఉంది అని స్పష్టం చేశారు. ఈ భారీ చేరికలతో శేరిలింగంపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ మరింత బలపడింది. ఈ కార్యక్రమంలో సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్ కొమటి సాయి బాబా, కార్పొరేటర్ వివేకానందనగర్ డివిజన్ మాధవరం రోజాదేవి రంగారావు, చందానగర్ మాజీ కార్పొరేటర్ నవత రెడ్డి, రోజా, గోపిరాజు శ్రీనివాస్ రావు, ఎర్రబెల్లి సతీష్, కొండాపూర్ డివిజన్ అల్లాఉద్దీన్ పటేల్, కిరణ్, క్రాంతి కిరణ్, సుబ్బరాజు, మల్లారెడ్డి, సంగారెడ్డి, రాంకిషన్ గౌడ్, కె.ఎన్.రాములు, కొండాపూర్ డివిజన్ సంతోష్, బీఆర్‌ఎస్‌వీ రాజు, నరేందర్, అనిల్ రెడ్డి, శివరాజ్, మజీద్, ముజీబ్, కొండల్ రెడ్డి, శేరిలింగంపల్లి నియోజకవర్గం సీనియర్ నాయకులు, మహిళా కార్యకర్తలు, యువత, తదితరులు పాల్గొన్నారు.
