రంజాన్ పండుగ సందర్బంగా ప్రజా ప్రభుత్వం తోఫా కిట్ల

పంపిణీ కార్యక్రమం లో పాల్గొన్న తుంబూరు దయాకర్ రెడ్డి.

రంజాన్ పండుగ సందర్బంగా ప్రజా ప్రభుత్వం తోఫా కిట్ల

 ఖమ్మం:( లోకల్ గైడ్)
 ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 32 వార్డుల ముస్లిం కుటుంబాలకి ప్రజా ప్రభుత్వం అందిస్తున్న తోఫా కిట్ల పంపకం ఈ రోజు వరంగల్ క్రాస్ రోడ్ లోని మసీద్ నందు నిర్వహించారు. ఈ కార్యక్రమం కి ముఖ్య అతిధి గా రెవిన్యూ, గృహనిర్మాణ మరియు సమాచార శాఖ మాత్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారి ఖమ్మం క్యాంప్ కార్యాలయ ఇంచార్జ్ శ్రీ తుంబూరు దయాకర్ రెడ్డి గారు, మున్సిపల్ చైర్మన్ పోకబత్తిన అనిత గారు, వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్ గారు పాల్గొని మున్సిపాలిటీ పరిధిలోని అన్ని ముస్లిం కుటుంబలకి ప్రభుత్వం తరుపున తోఫా కిట్లు అందించారు. ఈ సందర్బంగా దయాకర్ రెడ్డి గారు ముస్లిం సోదర సోదరిమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసారు. అలానే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి దివంగత శ్రీ వై. ఎస్. రాజశేఖర్ రెడ్డి గారు ముస్లిం మైనారిటీ లకు రిజర్వేషన్ కల్పించిన విషయం ఈ సందర్బంగా గుర్తుచేసుకున్నారు. ఏ పథకం అమలు చేయాలి అన్న అది కేవలం కాంగ్రెస్ పార్టీ వల్లనే అవుతుంది అని, రాబోయే రోజుల్లో ముస్లిం మైనారిటీ కి ఇచ్చిన మాట ప్రకారం ప్రతి వక్క హామీ నేరవేరుస్తారు మన శ్రీనన్న అని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమం లో వారితో పాటు ఏదులాపురం మున్సిపల్ కౌన్సిలర్ లు వెంపటి ఉమా, బానోత్ దివ్య,బుర్ర మహేష్, కడవ నవీన్, బానోత్ ప్రసాద్, రాజ్యాంగ పరిరక్షణ కమిటీ జాతీయ అధ్యక్షులు సయ్యద్ సాధిక్ అలీ,పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆత్మ కమిటీ డైరెక్టర్ ఎన్. పి. చారీ,ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్, నూకల రామ్మోహన్ రెడ్డి, మున్సిపల్ కాంగ్రెస్ నాయకులు కళ్లెం శేషి రెడ్డి వెంపటి సురేష్, వెంపటి రవి,ఎండ్ హుస్సేన్,బానోత్ కిషోర్, హరి, రంజిత్ నాయక్ ముస్లిం సోదర సోదరిమణులు అధిక సంఖ్య లో పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

నేషనల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు వేణు ముప్పాల అరుదైన ఘనత నేషనల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు వేణు ముప్పాల అరుదైన ఘనత
    కుత్బుల్లాపూర్ మార్చి 23 ( లోకల్ గైడ్ ప్రతినిధి) జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారుడు వేణు ముప్పాల అరుదైన ఘనత సాధించారు. ప్రతిష్టాత్మకమైన యోనెక్స్ సన్‌రైజ్
అభివృద్ధి నిరంతర ప్రక్రియ....
శాఖాహారం అమృతహారం.
దాతృత్వాన్ని చాటుకున్న సర్పంచ్ మత్రు నాయక్ 
ఏప్రిల్ 5 వ తేదీన జరిగే హిందూ సమ్మేళనంను జయప్రదం చేయండి. 
రైతు ఉత్సవాలకు అక్బర్‌పేట భూంపల్లి నుంచి తరలి వెళ్లిన
*ఎల్బీ కళాశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం* *