కొండాపూర్ మండలంలో రూ.68 లక్షలతో సీసీ రోడ్లకు శంకుస్థాపన
ఎమ్మెల్యే చింత ప్రభాకర్
By Ram Reddy
On
లోకల్ గైడ్/ సంగారెడ్డి :
సంగారెడ్డి నియోజకవర్గంలోని కొండాపూర్ మండలంలో గ్రామీణ అభివృద్ధికి మరో అడుగు పడింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్ ఆర్ ఈ జి ఎస్ )నిధుల ద్వారా రూ.68 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అనంతసాగర్, సైదాపూర్, మారేపల్లి, కొండాపూర్ గ్రామాలకు రూ.8 లక్షల చొప్పున, శివన్నగూడెం, హరిదాస్‌పూర్, తమ్మలిభాయి తాండా, మునిదేవునిపల్లి గ్రామాలకు రూ.6 లక్షల చొప్పున నిధులు కేటాయించి సీసీ రోడ్ల పనులు ప్రారంభించారు.శంకుస్థాపన జరిగిన గ్రామాలు,అనంతసాగర్ రూ.8 లక్షలు,సైదాపూర్ రూ.8 లక్షలు,మారేపల్లి రూ.8 లక్షలు,
కొండాపూర్ రూ.8 లక్షలు,
శివన్నగూడెం రూ.6 లక్షలు,
హరిదాస్‌పూర్ రూ.6 లక్షలు,
తమ్మలిభాయి తాండా రూ.6 లక్షలు,మునిదేవునిపల్లి రూ.6 లక్షలు, అదేవిధంగా కొండాపూర్ గ్రామంలో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించనున్న రెండు మహిళల సమైక్య భవనాలకు కూడా ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.గ్రామాలకు చేరుకున్న ఎమ్మెల్యే చింత ప్రభాకర్ నీ గ్రామస్తులు డప్పు చప్పులతో ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో చేపట్టిన సీసీ రోడ్ల పనులను నాణ్యతతో ఈ నెల 25వ తేదీ లోపు పూర్తి చేయాలని అధికారులకు, కాంట్రాక్టర్లకు సూచించారు. ఎన్నికల వరకే రాజకీయాలు ఉండాలి గానీ, ఎన్నికల తరువాత రాజకీయ కక్ష సాధింపులు సరికాదన్నారు. గ్రామాల్లో ప్రజలు కోరుకునేది అభివృద్ధి మాత్రమేనని, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలైన పారిశుద్ధ్యం, త్రాగునీరు, వీధి దీపాలు, రహదారులు వంటి అంశాలపై ఎలాంటి వివక్ష లేకుండా పనిచేయాలని అన్నారు.
అనంతరం రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేసిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్, రెండు సంవత్సరాలుగా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. రైతులకు రూ.15 వేల రైతుబంధు ఇస్తామని చెప్పి అమలు చేయలేదని, రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేస్తున్నారని అన్నారు. మహిళలకు నెలకు రూ.2500, విద్యార్థులకు స్కూటీలు వంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి వాటిని అమలు చేయలేదని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు బీఆర్‌ఎస్ పార్టీ తరఫున పోరాటం కొన సాగిస్తామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు విఠల్, ప్రధాన కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ మల్లగౌడ్, మాణిక్ ప్రభూ, పాండురంగం, శ్రీధర్ రెడ్డి, అనంతసాగర్ గ్రామ సర్పంచ్ నర్సింలు, మాజీ సర్పంచ్ ఇంద్రారెడ్డి, సైదాపూర్ సర్పంచ్ రాధికా రామగౌడ్, మారేపల్లి సర్పంచ్ సంగీత అనిల్, శివన్నగూడెం సర్పంచ్ వినోద్ కుమార్, హరిదాస్‌పూర్ సర్పంచ్ నేనావత్ రాంచందర్, మునిదేవునిపల్లి సర్పంచ్ డప్పు కృష్ణ, ఉప సర్పంచ్ వరలక్ష్మి కృష్ణ రెడ్డి, కొండాపూర్ సర్పంచ్ స్రవంతి అమరేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ రాజ్ కుమార్, మాజీ సర్పంచ్ రుక్మొద్దీన్ తదితర ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Tags:
About The Author
Latest News
23 Mar 2026 13:11:56
కుత్బుల్లాపూర్ మార్చి 23 ( లోకల్ గైడ్ ప్రతినిధి)
జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారుడు వేణు ముప్పాల అరుదైన ఘనత సాధించారు. ప్రతిష్టాత్మకమైన యోనెక్స్ సన్‌రైజ్
