సంక్రాంతి సంబరాల త్రివేణి
రంగురంగుల ముగ్గులు వేసి గొబ్బిళ్ళను పెట్టి గొబ్బి పాటలు పాడారు.
ఖమ్మం లోకల్ గైడ్
ఖమ్మం నగరంలోని త్రివేణి పాఠశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రీ ప్రైమ రీ విద్యార్థినీ విద్యార్థులకు పాఠశాల అధ్యాపకులు భోగి పళ్ళను పోసి ఆశీర్వదించారు.
విద్యార్థినులు చక్కని రంగురంగుల ముగ్గులు వేసి గొబ్బిళ్ళను పెట్టి గొబ్బి పాటలు పాడారు.విద్యార్థులు రకరకాల వేషధారణలను ధరించి పండగ సంబరాల్లో పాల్గొన్నారు.పాలు పొంగిచ్చి పొంగళ్లను చేశారు. పిల్లల తల్లిదండ్రులలో, పురుషులకు గాలిపటాల తయారీలో మరియు మహిళలకు రంగవల్లుల పోటీ నిర్వహించి విజేతలుగా నిలిచిన తల్లిదండ్రులకు బహుమతి ప్రధానం చేయడం జరిగింది. పాఠశాల డైరెక్టర్ డాక్టర్ గొల్లపూడి వీరేంద్ర చౌదరి ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ రైతులకు పంటలన్నీ చేతికొచ్చి చక్కని ఆనందంగా వేడుకలు చేసుకోవడమే సంక్రాంతి అని, సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడం ఉత్తరాయణంలోనే జరుగుతుందని ఇది ఎంతో పవిత్రమైన కాలమని అన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణవేణి త్రివేణి విద్యాసంస్థల డైరెక్టర్ యార్లగడ్డ వెంకటేశ్వరరావు పాఠశాల సిఆర్ఓ కాట్రగడ్డ మురళి కృష్ణ పాఠశాల ప్రిన్సిపల్ రాజేంద్రప్రసాద్ వైస్ ప్రిన్సిపాల్ స్వప్న,ముస్తఫా, క్యాంపస్ ఇంచార్జ్ చార్లెస్, సందీప్ మరియు ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
