వెలుగుమట్లలో యుద్ధప్రాతిపదికన అభివృద్ధి పనులు.....
రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వర రావు ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదల సంక్షేమానికి ప్రాధాన్యం
విద్యుత్, త్రాగునీటి సదుపాయాల పనులు పూర్తి* *లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసుకోవాలి* వెలుగుమట్ల భూదాన్ భూముల్లో అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి తుమ్మల
ఖమ్మం, మార్చి - 28:లోకల్ గైడ్ :
----------------------------
వెలుగుమట్ల భూదాన్ భూముల్లో లబ్ధిదారులకు అన్ని సౌకర్యాలతో కూడిన మోడల్ కాలనీగా అభివృద్ధి చేసి పేదలకు గౌరవప్రదమైన జీవన వాతావరణం కల్పిస్తామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
ఈ సందర్భంగా *మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ* ప్రజల మౌళిక అవసరాలను ప్రాధాన్యంగా తీసుకుని ప్రతి కుటుంబానికి త్రాగునీరు, విద్యుత్, రోడ్లు వంటి సదుపాయాలు సమగ్రంగా అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
గత పది సంవత్సరాల కాలంలో పేదలు మౌళిక సదుపాయాల కొరతతో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఇందిరమ్మ ప్రభుత్వంలో ఆ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తున్నామని తెలిపారు. ప్రతి లబ్ధిదారుడికి నాణ్యమైన గృహ నిర్మాణం పూర్తి చేయించడమే లక్ష్యమని అన్నారు.
వెలుగుమట్ల కాలనీలో విద్యుత్, త్రాగునీరు, రోడ్లు, కాలువలు, పారిశుద్ధ్య వ్యవస్థ వంటి అన్ని సదుపాయాలు సమగ్రంగా ఏర్పాటు చేసి ఆదర్శవంతమైన నివాస ప్రాంతంగా తీర్చిదిద్దుతామని మంత్రి స్పష్టం చేశారు. కాలనీలో స్కూల్, కమ్యూనిటీ హాల్, పార్క్ వంటి సామాజిక వసతులను కూడా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. అంతర్గత రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణం యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలన్నారు. నెలలోపు డ్రెయిన్ల నిర్మాణం పూర్తి చేయాలని, వర్షాకాలం కాలనీలో నీటి నిలువ సమస్యలు ఉండకూడదని మంత్రి ఆదేశించారు.
హౌసింగ్ శాఖ ఆధ్వర్యంలో లబ్ధిదారులు తమ ఇళ్ల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసుకోవాలని మంత్రి సూచించారు. అధికారులందరూ సమన్వయంతో పని చేసి మిగిలిన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు.
అభివృద్ధి పనుల పురోగతిపై మంత్రి సంతృప్తి వ్యక్తం చేస్తూ, నిర్దేశిత గడువులోనే అన్ని పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతరావు, ఆర్&బీ ఎస్ఈ యాకుబ్, హౌసింగ్ పీడీ భూక్యా శ్రీనివాస్, పబ్లిక్ హెల్త్ ఈఈ రంజిత్, ఖమ్మం ఆర్డీవో శ్రీనివాస్, తహసీల్దార్లు డి. జయచందర్, సైదులు, ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
.
