కన్నుల పండువగా కల్యాణ మహోత్సవం శ్రీ సీతారాముల కల్యాణం.
అశేష భక్తజన సందోహం మధ్య తంగెళ్లపల్లిలో రాములోరి కల్యాణం.
పాల్గొన్న గ్రామ అతిరథ మహారథులు భక్త జన సంద్రాన్ని తలపించిన దృశ్యం
లోకల్ గైడ్ న్యూస్ కొందుర్గు
దేదీప్యమానమైన శ్రీశ్రీశ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో భక్తులు పాల్గొని తిలకించి, ప్రత్యేక పూజలు నిర్వహించి సీతారాముల ఆశీర్వాదం పొంది తీర్థప్రసాదాలు స్వీకరించడమైనది
ఉదయం శ్రీ ఆంజనేయ స్వామి చంద్రం అలంకరణ పూజ తో మొదలై హోమం లో పాల్గొని తదుపరి శ్రీ సీతా రాముల కళ్యాణం కార్యక్రమం వైభవంగా కొనసాగింది సీతమ్మ తల్లి గారి తరపున కన్యాదాన సేవ శ్రీ చెక్కల అన్నపూర్ణ శ్రీశైలం ముదిరాజ్ చేయగా శ్రీ రాముని తరపున శ్రీ అంజమ్మ బాలరాజ్ పూజ కార్యక్రమాలు నిర్వహించారు.. ఈ కార్యక్రమం
ఆద్యంతం భక్తి పారవశ్యంతో కన్నుల పండువగా సాగింది. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొని మొక్కులు తీర్చుకొని స్వామి వారి ఆశీస్సులు పొందారు అలాగే తమ వంతు కట్నాలు చెల్లించి తమ కుటుంబ సభ్యులకు ఆశీర్వాదం పొందారు. ఈ కార్యక్రమంలోసర్పంచ్ చందన గోవర్ధన్ గౌడ్,మాజీ సర్పంచ్ లు ఎదిరా రామకృష్ణ,కుమ్మరి బాల్ రాజ్, జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు చెక్కల శ్రీశైలం, జర్నలిస్టు వెంకటేష్ గౌడ్, చెక్కల శ్రీనివాస్, పులిందర్ రెడ్డి,శీలం బాల్ రాజ్, నెర్ర బాల్ రాజ్, పెరుమాళ్ రెడ్డి, చెక్కల పవన్ , చెక్కల ప్రవీణ్, నిరాటి అశోక్, మంగలి సాయిలు,నాగేష్,యాదగిరి, రాజు, నర్సింలు , షావుకు శ్రీశైలం,సత్యనారాయణ రెడ్డి, మల్లారెడ్డి ఘనపురం, బుర్ర రవీందర్ గౌడ్,మాజీ వార్డు సభ్యులు బేగరి శేఖర్, రాఘవేందర్ రెడ్డి,దొడ్ల హరీష్ రెడ్డి చెక్కల లక్మయ్య, శ్రీనివాస్ గౌడ్, సత్యనారాయణ గౌడ్,చాకలి వెంకటయ్య, చాకలి నర్సింలు, చాకలి రాములు, చంద్రయ్య చెక్కల దశరథం , కూర యాదగిరి, దివిటి రామకృష్ణ, దివిటి చంద్రయ్య, గొల్ల క్రిష్ణయ్య,దివిటి రాము,
తదితర యువకులు మరియు పెద్దలు మహిళలు పాల్గొన్నారు.
