ఉన్నత విద్య నేటి తరాలకు అందించవలసిన అవసరం అధ్యాపకులపై ఉన్నది.
ప్రొఫెసర్ ఇటికాల పురుషోత్తం.
వైస్ చైర్మన్ తెలంగాణ ఉన్నత విద్యా మండలి
మిర్యాలగూడ ఏప్రిల్ 9
(లోకల్ గైడ్ తెలంగాణ )
కేఎన్ఎమ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అర్థశాస్త్ర విభాగం వారి నేతృత్వంలో జరుగుతున్న బేసిక్ స్టాటిస్టిక్స్ ఇన్ టీచింగ్ ఆఫ్ ఎకనామిక్స్ అనే వర్క్ షాప్ పైన తెలంగాణ రాష్ట్రంలోని అధ్యాపకులకు రెండు రోజులపాటు ఏప్రిల్ 9, 10 2026 నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రొఫెసర్ ఇటికాల పురుషోత్తం వైస్ చైర్మన్ తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ మాట్లాడుతూ నేటి విద్యా విధానంలో ఉపాధ్యాయులు చాలా కీలకమైన పాత్రను పోషిస్తున్నారని భవిష్యత్తు తరాలను నిర్మించేటటువంటి గురుతర బాధ్యతను పోషిస్తున్న ఉపాధ్యాయులు ఇటువంటి శిక్షణా తరగతులకు హాజరై సబ్జెక్టు పైన మరింత పట్టు సంపాదించుకొని విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడం కొరకు ముందుకు వచ్చిన ఉపాధ్యాయు లను అభినందించారు. తెలంగాణ ప్రభుత్వం ఉన్నత విద్యాభివృద్ధి కోసం అనేక సంస్కరణలను నూతన విధానాలను ప్రవేశపెడుతున్నదని ఇందుకు ఉపాధ్యాయులు కూడా తయారుగా ఉండాలని ఒక అత్యుత్తమ ఉపాధ్యాయుడు కొన్ని తరాల విద్యార్థుల జీవితాలను మార్చగలుగుతాడని ముఖ్యంగా స్టాటిస్టిక్స్ లాంటి కఠినతరమైన సబ్జెక్టుని విద్యార్థికి సులభంగా అర్థమయ్యేలాగా బోధించడం ఉపాధ్యాయుల కర్తవ్యం అని ఆ విధంగా కృషి చేయాలని తెలియజేశారు. ఇటువంటి వర్క్ షాప్ లను నిర్వహిస్తున్నటువంటి వర్క్ షాప్ డైరెక్టర్ డాక్టర్ గుమ్మడి నరేష్ ను ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదివే విద్యార్థులు పేద మధ్యతరగతి విద్యార్థులు ఉంటారు కాబట్టి వారి జీవితాలను మెరుగు దిద్దాల్సినటువంటి బాధ్యత లెక్చరర్స్ పైననే ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కళాశాల ప్రిన్సిపల్ శ్రీ భీమర్జున రెడ్డి మాట్లాడుతూ కేఎన్ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల గత కొన్ని సంవత్సరాల నుంచి అనేక రీసెర్చ్ కార్యక్రమాలను కొనసాగిస్తుందని భవిష్యత్తులో కూడా కళాశాల చేపట్టే పరిశోధనాత్మక కార్యక్రమాలకు మద్దతునివ్వాలని ప్రొఫెసర్ ఇటికాల పురుషోత్తo కోరారు. ఈ కార్యక్రమానికి గెస్ట్ ఆఫ్ హానర్ గా విచ్చేసినటువంటి రీజినల్ డైరెక్టర్ కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ హైదరాబాద్ ప్రొఫెసర్ సుజిత్ కుమార్ మిశ్రా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల స్థాయిలో ఇటువంటి వర్షాలు నిర్వహించడం అనేది ఎంతో అభినందించదగిన విషయమని అందుకు వర్క్ షాప్ డైరెక్టర్ డాక్టర్ గుమ్మడి నరేష్ కు శుభాకాంక్షలు తెలియజేశారు అంతేకాక కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ చేపట్టే ఇంటెన్షిప్ కార్యక్రమాలకు కేఎన్ఎమ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులను ఎంపిక చేస్తామని ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ గారికి సుజిత్ కుమార్ మిశ్రా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి ప్రొఫెసర్ జి రామకృష్ణ విసిటింగ్ ప్రొఫెసర్ సెంటర్ ఫర్ ఎకనామిక్స్ సోషల్ స్టడీస్ వారు మాట్లాడుతూ ఎకనామిక్స్ లో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సీ పాత్ర పెరిగిందని తద్వారా అధ్యాపకులు కూడా నూతన వరవడిని ముఖ్యంగా టెక్నాలజీని స్టాటస్టిక్స్ ను అందిపుచ్చుకొని విద్యార్థులకు సులభతరమైన విధంగా బోధించాలని అధ్యాపకులకు సూచించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వర్క్ షాప్ డైరెక్టర్ డాక్టర్ గుమ్మడి నరేష్ మాట్లాడుతూ కేఎన్ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల చేపడుతున్న రీసెర్చ్ కార్యక్రమాలకు వెన్నుదన్నుగా నిలుస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ వైస్ చైర్మన్ ప్రొఫెసర్ పురుషోత్తం కి తాను ఎల్లవేళలా కృతజ్ఞతలు తెలుపుతానని, అలాగే ఇటువంటి పరిశోధనా కార్యక్రమాలకు వెన్నుదన్నుగా నిలుస్తూ ప్రత్యేకంగా ప్రోత్సహిస్తున్న కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ భీమార్జున్ రెడ్డి కు తాను ఎల్లవేళలా రుణపడి ఉంటానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ ఇటికాల పురుషోత్తం రచించిన నేటి నిజం అనే పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది పుస్తకాన్ని అధ్యాపకులు అందరికీ కూడా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి కమిషనర్ ఆఫ్ కాలేజీట్ ఎడ్యుకేషన్ నుంచి 16 మంది లెక్చరర్ లకు రెండు రోజులపాటు ఆన్ డ్యూటీ ప్రొసీడింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కెఎన్ఎమ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపక ఇతర బృందం పాల్గొన్నారు.
