శ్రామిక మహిళల ఉపాధి రక్షణ చట్టాల అమలుకై పోరాడుదాం 

-పీ ఓ డబ్ల్యూ కార్యదర్శి వై. జానకి 

శ్రామిక మహిళల ఉపాధి రక్షణ చట్టాల అమలుకై పోరాడుదాం 

IMG-20260306-WA0081ఖమ్మం జిల్లా, కారేపల్లి : లోకల్ గైడ్, మార్చి 6 :

ప్రగతిశీల  మహిళా  సంఘం  పి ఓ డబ్ల్యూ ఖమ్మం  జిల్లా  కార్యదర్శి  వై జానకి  
అంతర్జాతీయ  మహిళ ఉత్సవాన్ని  ఈనెల  ఒకటి  నుండి 8 వరకు  అన్ని  గ్రామాలలో  సదస్సులు  సమావేశాలు  నిర్వహించాలని  పిలుపునిచ్చారు.  అందులో భాగంగా   సింగరేణి  మండలం పేరుపల్లి  జమల  పెళ్లి  గ్రామాలలో  అంతర్జాతీయ మహిళా  దినోత్సవ  సదస్సుల వాల్  పోస్టర్లను  ఆవిష్కరించడం జరిగింది.  ఈ  కార్యక్రమంలో పి ఓ డబ్ల్యూ  జిల్లా  కార్యదర్శి  వై. జానకి  మాట్లాడుతూ  భారత దేశానికి  స్వాతంత్రం  వచ్చి  79 సంవత్సరాలు  గడుస్తున్న మహిళలపై  అన్ని  విధాలుగా ఇంట  బయట  పని  ప్రదేశాలలో అవమానాలకు  వేధింపులకు గురి  అవుతున్నారని  మతోన్మాద బిజెపి  ఆర్ ఎస్ ఎస్  మను  వాద  భావజాలాలను  మహిళలపై  రుద్దతూ  వంటింటికి పరిమితం  చేస్తున్నారని,  మహిళలపై  దాడులు మానభంగాలు  యాసిడ్  దాడులు  చిన్న పిల్లలపై, వృద్ధులపై  అత్యాచారాలు  హత్యలు  నిత్యం  జరుగుతున్న ప్రభుత్వాలు  పట్టించుకోవటం లేదని  మహిళలకు రక్షణ లేకుండా  పోయిందని  పోరాడి సాధించుకున్న  హక్కులను,  చట్టాలను  నేటి  ప్రభుత్వాలు అమలకు  పూలుకోకుండా తుంగలో  తొక్కి  వేస్తున్నారని,
వీటికి  వ్యతిరేకంగా  శ్రామిక మహిళల  ఉపాధి  రక్షణ చట్టాల అమలకై  సమాజంలో మహిళలందరూ  ఐక్యమై పోరాటాలలో  ముందుకు సాగాలని  ఈ  సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో  ప్రగతిశీల మహిళా  సంఘం  మండల నాయకులు  ఆలెం సుగుణ, మంగమ్మ, లక్ష్మి , పద్మ , జ్యోతి,  సుజాత, నాగలక్ష్మి , బుజ్జమ్మ,  తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News