శేరిలింగంపల్లి బీఆర్‌ఎస్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
శేరిలింగంపల్లి, (లోకల్ గైడ్ వెస్ట్ జోన్ స్టాఫ్ రిపోర్టర్ కృష్ణ): అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శేరిలింగంపల్లి బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు మరబోయిన రవి యాదవ్ ఆధ్వర్యంలో, మరబోయిన స్వాతి యాదవ్ సమక్షంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలతో కలిసి కేక్ కట్ చేసి వారికి చీరలు అందజేసి సన్మానించారు. మహిళల సేవలు, వారి త్యాగం, సమాజ అభివృద్ధిలో వారి కీలక పాత్రను గుర్తు చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఆనందంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రవి యాదవ్ మాట్లాడుతూ..మహిళలు కుటుంబానికి మాత్రమే కాకుండా సమాజానికి కూడా బలమైన ఆధారం. మహిళలు అన్ని రంగాలలో ముందుకు వస్తే సమాజం మరింత అభివృద్ధి చెందుతుంది. ప్రతి మహిళ విద్యావంతురాలిగా, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని కోరుకుంటున్నాను అని అన్నారు. అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో మహిళల సంక్షేమం కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారని, మహిళల సాధికారత కోసం బీఆర్‌ఎస్ పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రామదేవి, ఆశ మారాజు, స్వరూప, దివ్య, ఆర్.అనిత, పద్మ, సి.నాగమణి, బేబీ, సంగీత, నీతూ, నాగమణి, పింకీ తదితర మహిళలు, కె.ఎన్ రాములు, గడ్డ శ్రీనివాస్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. “మహిళల శక్తి-సమాజానికి శక్తి” అనే నినాదంతో కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది.
