భారత కమ్యూనిస్టు పార్టీ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు.

భారత కమ్యూనిస్టు పార్టీ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు.

 

 మిర్యాలగూడ మార్చి 8
( లోకల్ గైడ్ తెలంగాణ)

భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పార్టీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళా సమైక్య ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించినారు ఈ సందర్భంగా సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు  మహిళా సమైక్య నియోజకవర్గ కార్యదర్శి ఎర్రబోతు పద్మ మహిళా సమైక్య నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ డి.శాంతి మహిళా సమైక్య టౌన్ కార్యదర్శి ఎస్కే షమీం వారు మాట్లాడుతూ. నేటికీ భారతదేశంలో ఏదో ఒక మూలన మహిళలపై హత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయని వీటిని అరి కట్టడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందినయని వారన్నారు మహాత్మా గాంధీ కన్న కలలు అర్ధరాత్రి ఒంటరిగా మహిళ ఎప్పుడు నడుస్తున్నదో అప్పుడు మహిళలకు రక్షణ కలుగుతుందని వారు అన్నారని గుర్తుకు చేసినారు మహాత్మా గాంధీ కన్న కలలు  నేటికీ అమలు కాలేదని వారు అన్నారు మహిళలపై అమానుషంగా ప్రవర్తించిన వారిపై భేషరతుగా వారిని కఠినంగా శిక్షించాలని వారి మీద నాన్ బేల్ బుల్  కేసులు పెట్టి శిక్షించాలని వారన్నారు హ్యాపీఉమెన్స్ డే కేకును కేకును మహిళా సమైక్య నాయకురాలు కట్ చేసి అందరూ ఆనందంతో కేక్ ను ఒకరికి ఒకరు తినిపించుకుంటూ సంబరాలు జరుపుకున్నారు ఆ తర్వాత సమైక్య జెండాని మహిళా సమైక్య నియోజకవర్గ కార్యదర్శి ఎర్రబోతు పద్మ ఆవిష్కరించారు మహిళలకు శాలువాలతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మహిళా సమాఖ్య నాయకురాలు ఎర్ర ప్రమీల, రత్నకుమారి,లింగంపల్లి లక్ష్మమ్మ, డి.జ్యోతి,ఉమ్మెత్త  లక్ష్మమ్మ,సైదమ్మ,నర్సమ్మ, నర్మదా, వేమనపల్లి మండల కార్యదర్శి జిల్లా యాదగిరి సాలె జగన్, తదితరులు పాల్గొన్నారు..

Tags:

About The Author

Latest News