ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక...

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 10రోజులపాటు చేపట్టనున్న వివిధ కార్యక్రమాలు

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక...

 

బెల్లంపల్లి (లోకల్ గైడ్)


ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 10రోజులపాటు చేపట్టనున్న వివిధ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.మొదటి రోజు శనివారం కళాశాలలో స్పెషల్ డ్రైవ్ ప్రారంభించి వివిధ కమిటీలు ఏర్పాటు చేశారు.2వ రోజు కళాశాల గ్రంథాలయం,తరగతి గదులు,ప్రయోగశాలలు శుభ్రం చేయించినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ కాంపల్లి శంకర్ తెలిపారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ దావ స్వాతి,కౌన్సిలర్లు నీలి హారిక,శ్రావణ్ కుమార్,కాంగ్రెస్ సీనియర్ నాయకులు దావ రమేష్ బాబు తదితరులు హాజరయ్యారు.ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతు పట్టణ ప్రజలు ప్రతి ఒక్కరు పట్టణ పరిశుభ్రతకు పాటుపడాలని పిలుపునిచ్చారు.సంస్థాగత బలోపేతానికి కృషి చేయాలని,ఆయా గదులను సమగ్రంగా శుభ్రం చేయించడంతో పాటు వివిధ విభాగాల నుండి వ్యర్థ పదార్థాలను,తుక్కును తొలగించినట్లు ప్రిన్సిపల్ వివరించారు.రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా సంస్థాగత బలోపేతానికి కృషి చేస్తున్నట్లు ప్రిన్సిపల్ పేర్కొన్నారు.ప్రతి ఒక్కరు ఎవరికి వారు శుభ్రత పాటించాలని కోరారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్,గ్రంథాలయ ఇంచార్జి మేడ తిరుపతి,అసిస్టెంట్ ప్రొఫెసర్లు,అధ్యాపకులు సూపరింటెండెంట్,బోధనేతర సిబ్బంది,విద్యార్థినీ,విద్యార్థులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News