వ్యవసాయ కూలీల హక్కుల కోసం పోరాడుదాం

మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య

వ్యవసాయ కూలీల హక్కుల కోసం పోరాడుదాం

IMG-20260306-WA0113ఖమ్మం జిల్లా, కారేపల్లి : లోకల్ గైడ్, మార్చి 6 :  

దేశంలో అధికారంలో  ఉన్న  బిజెపి  ప్రధాని  మోడీ  పాలనలో  దేశ ఆర్థిక  పరిస్థితి  రోజురోజుకు కూచించుకు  పోతుంది  అని ,  రూపాయి  విలువ  రోజురోజుకు దిగజారిపోయి  సంక్షోభం  వైపు పరుగులు  తీస్తుందని , ఆదాని అంబానీ  లాంటి  కుబేరులు మరింత  పెరిగిపోతూ సంపన్నులుగా మారిపోతున్నారని. పేదలు మాత్రం  కటిక  దరిద్రంలోకి నెట్టబడుతున్నారని  అర్ధాకలితో అలమటిస్తూ  అన్నమో రామచంద్ర  అంటూ దేహరించాల్సిన  పరిస్థితి  ఈ దేశ ప్రధాని వ్యవసాయ కూలీలు రైతాంగ కార్మిక వర్గం లాంటి అన్ని వర్గాలపై తన దాడిని ఎక్కిపెట్టిందని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య అన్నారు.
    శుక్రవారం  రోజు అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం ఏఐపీకే  ఎంఎస్  ఖమ్మం  డివిజన్ ప్రధమ  మహాసభ  కారేపల్లి  మండలం టేకులగూడెం  గ్రామంలో  అమరుడు లక్ష్మీనరసు  నగర్  లో కూరాకుల నరసయ్య  అధ్యక్షతన  జరిగింది.
    మా  సభకు  ముందుగా  డివిజన్ అధ్యక్షులు  కూరాకుల  నరసయ్య జండా  ఆవిష్కరించారు. ఈ మహాసభకు  ప్రారంభ  ఉపన్యాసకులుగా  గుమ్మడి  నరసయ్య పాల్గొని  మాట్లాడుతూ  పార్లమెంటు సాక్షిగా  అనేక  చట్టాలను  మార్చి  కొత్తవి చేసి  ప్రజలను  పీడిస్తుందని. యాట రెండు  కోట్ల  ఉద్యోగాల  మాట అటకెక్కిందని, నల్లధనం  తెచ్చి  ప్రతి కుటుంబానికి 15 లక్షలు ఖాతాలో వేస్తామని  ప్రజలను  దగా  చేసిన ప్రధానిగా  మోడీ  నిలిచారని ,  నిత్యవసర  సరుకుల  ధరలు రోజురోజుకు  ఆకాశాన్ని  అంటుతున్న పట్టించుకున్న  పాపాన  పోలేదని. భారతదేశం  వెలుగు  పోతుందని  తెగ ప్రచారం  చేసుకుంటున్నా  భారత పాలకులు  ఆకలి  సూచికల్లో 127 దేశాల్లో 105వ స్థానంలో  ఉన్నదని అంటే  మన  పరిస్థితి  ఏంటో అర్థం అవుతుందని గుమ్మడి  నరసయ్య అన్నారు. 
   ఈ మహాసభలో కార్యదర్శి కే లో పాపారావు కార్యదర్శి నివేదిక ప్రవేశపెట్టారు. వివిధ కారణాలతో రైతాంగ. కార్మిక పోరాటాలలో అమృతం పొందిన అమరవీరులకు సంతాపం తెలియజేశారు.
  మహాసభలో ఖమ్మం డివిజన్ అధ్యక్షునిగా కూరాకుల నరసయ్య. ఉపాధ్యక్షులుగా చల్ల రాజు. ప్రధాన కార్యదర్శిగా కే లోతు పాపారావు. సహాయ కార్యదర్శిగా కోడెం సీతారాములు. కోశాధికారిగా ఎస్.కె హుస్సేన్ బి తో పాటు 16 మందిని మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకున్నది. 
   మహాసభ కొత్తగా తెచ్చిన విబిజి రాంజీ పథకాన్ని రద్దుచేసి. 
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా అమలు చేయాలని. 
   200 రోజులు పని దినాలు కల్పించాలని.
    ఎలాంటి షరతులు లేకుండా రోజుకు 600 రూపాయల వేతనం ఇవ్వాలని. 12 వేల రూపాయల జీవన భృతి వెంటనే ఇవ్వాలని మహాసభ తీర్మానించనైనది. మార్చి 24, 25 తేదీలలో కామారెడ్డిలో  ఏ ఐ పీ కే ఎం ఎస్  రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని సభ అభిప్రాయపడింది.
    ఈ కార్యక్రమంలో ఏ ఐ పీ కే ఎం ఎస్ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి బందెల వెంకయ్య,  ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి తిమ్మిడి హనుమంతరావు,  సి పి ఎం ఎల్ మాస్ లైన్ ఖమ్మం డివిజన్ కార్యదర్శి టి ఝాన్సీ,  టేకులగూడెం సర్పంచ్ గుమ్మడి సందీప్ ,  ఏ ఐ పీ కే ఎంఎస్ నాయకులు చల్ల రాజు , రావుల నాగేశ్వరరావు , మేక రామనాథం , పొట్లపల్లి కృష్ణ ,  కోడం సీతారాములు,  గుమ్మడి ఎర్రయ్య ,  గుమ్మడి సరోజిని ,  అనసూర్య , సీత , సమ్మక్క , సత్తిరెడ్డి,  సక్రు , రాము , రమణ  తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

తుర్మామిడి గ్రామంలో రంజాన్ తోఫాల పంపిణీ. తుర్మామిడి గ్రామంలో రంజాన్ తోఫాల పంపిణీ.
లోకల్ గైడ్/బంట్వారం: పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా బంట్వారం మండల పరిధిలోని తుర్మామిడి గ్రామంలో బుధవారం ముస్లిం మహిళలకు రంజాన్ తోఫాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు....
నర్మెట్టలో రైతు ఉత్సవాలకు ఘన ప్రారంభం
_శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది కవి పద్య సమ్మేళనం ఘనంగా
అంబేద్కర్ యువజన సంఘం నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక.
నూతన తెలుగు సంవత్సరము ను పురస్కరించుకుని
సర్వారం గ్రామంలో బస్సు రోజు వీర బ్రహ్మచారి గుండెపోటుతో మృతి. 
రేపే రైతు మేళా ప్రారంభం – ఏర్పాట్లలో అధికారుల బిజీ