జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన లోకల్ గైడ్ దినపత్రిక ఎడిటర్
చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ చిలకమర్రి రాంరెడ్డి
6టివి , జిఎం సాయిబాబా, నవ ప్రభాకర్ రావు, చిట్టిబాబు జబర్దస్త్ టీం
బాపూజీ హైస్కూల్ లో ఘనంగా 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలుశేరిలింగంపల్లి, లోకల్ గైడ్ : జగద్గిరిగుట్ట 79 వ జాతీయ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జగద్గిరిగుట్ట బాపూజీ హైస్కూల్ లో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న లోకల్ గైడ్ దినపత్రిక ఎడిటర్, ఎల్ జి టివి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, చిలకమర్రి రామ్ రెడ్డి జెండా ఎగురవేసి విద్యార్థులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఉపన్యాసంలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేసి విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా లోకల్ గైడ్ దినపత్రిక ఎడిటర్, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ చిలకమర్రి రాంరెడ్డి మాట్లాడుతూ..తెలంగాణ ప్రజలకు 79 వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి, స్వాతంత్ర్య ఫలాలు ప్రతీ పౌరులకు అందాలని, మహనీయుల అడుగుజాడలలో నడుస్తూ స్వాతంత్రోద్యమ స్పూర్తితో
స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, లౌకికతత్వం, అభివృద్ధి సాదించే దిశగా
ముందుకు సాగుదాం అని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో 6టివి జనరల్ మేనేజర్ సాయిబాబా, కరెస్పాండెంట్ నవ ప్రభాకర్ రావు, బాపూజీ హైస్కూల్ చైర్ పర్సన్ లక్ష్మీ, జబర్దస్త్ టీం చిట్టిబాబు విద్యార్థుల తల్లి దండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
About The Author
