కనీస వేతనాల సలహా మండలి సిఫారసులు అమలు చేయాలి.
వేతనాల పెంపులో సుప్రీంకోర్టు తీర్పులను పరిగణనలోకి తీసుకోవాలి
By Ram Reddy
On
2021లో విడుదల చేసిన ఐదు ప్రిలిమినరీ జీవోలను గెజిట్ చేయాలి. సిఐటియు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ.
నల్లగొండ ఉమ్మడి జిల్లా. లోకల్ గైడ్ :
రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాల సవరిస్తూ 2021లో విడుదల చేసిన ఐదు ప్రిలిమినరీ జీఓలను యధాతథంగా గెజిట్ చేయాలనీ, కనీస వేతనాలపై వేసిన సబ్‌కమిటీ కాలయాపనకు స్వస్తి చెప్పాలని,వేతనాల పెంపులో సుప్రీం కోర్టు తీర్పులను పరిగణనలోకి తీసుకోవాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కనీస వేతనాల జీవోల విడుదల కోసం మంగళవారం సిఐటియు రాష్ట్ర కమిటీ మేరకు డిప్యూటీ లేబర్ కమిషనర్ జి బి ఎన్ స్వామి కు వినతిపత్రం అందజేశారు.ప్రభుత్వ విడుదల చేసిన ఐదు పిలిమినరీ జీవోలను వెంటనే గెజిట్ చేయాలని మిగిలిన 68 షెడ్యూల్డ్ పరిశ్రమల జీఓలను వెంటనే విడుదల చేయాలని కోరారు.కనీస వేతనాల సవరణకు సుప్రీం కోర్టు తీర్పులను పరిగణనలోకి తీసుకోవాలని,కనీస వేతనాల సలహా మండలి ప్రతిపాదనలు పక్కనపెట్టి కేబినెట్ సబ్ కమిటీ చేస్తున్న కాలయాపనకు స్వస్తి చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రమేర్పడిన పదేండ్లలో నాలుగు కనీస వేతన సలహా మండళ్లు చేసిన సూచనలను గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం బుట్టదాఖలు చేసిందని తప్పుబట్టారు.2016 నుంచి 2021 వరకు సాగిన కనీస వేతనాల సలహా మండలి సూచనలతో 2021లో ఐదు షెడ్యూల్డ్ ఎంప్లాయిమెంట్లకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం జీవోలను జారీ చేసిందనీ,ఆ తర్వాత యాజమాన్యాల ఒత్తిడితో గెజిట్ చేయకుండా పెండింగ్‌లో పెట్టిందని విమర్శించారు.షెడ్యూల్డ్ పరిశ్రమల్లో పని చేస్తున్న కార్మికులకు జారీ చేసిన జీవోలను గెజిట్ చేయకపోవడం వల్ల ప్రతి నెలా రూ.6 వేల కోట్లు నష్టపోతున్నారని వాపోయారు. ఇలా కార్మికుల శ్రమ దోపిడీని ప్రోత్సహిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు వత్తాసు పలకడం అన్యాయమని పేర్కొన్నారు.ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం తన కార్మిక వ్యతిరేక చర్యను విడనాడి కనీస వేతనాల సలహా మండలి సిఫారసుల ప్రకారం 73 షెడ్యూల్డ్ ఎంప్లాయిమెంట్ పరిశ్రమల్లో పని చేస్తున్న కార్మికుల కనీస వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండం పల్లి సత్తయ్య, జిల్లా కోశాధికారి బాణాల పరిపూర్ణ చారి, పవర్లూమ్ జిల్లా అధ్యక్షుడు గంజి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.Tags:
About The Author

Latest News
19 Aug 2025 20:08:16
వినాయక విగ్రహాలుఏర్పాటుకు అనుమతి తప్పనిసరి విగ్రహాల ఏర్పాటు ఆన్లైన్ ద్వారా సమాచారం అందించాలి . మోమిన్ పెట్ సర్కిల్ఇ న్స్పెక్టర్ బి.వెంకట్