విధేయతకు దక్కనున్న అరుదైన గౌరవం?

కాంగ్రెస్ సీనియర్ నాయకులు షేక్ పాషాకు కో ఆప్షన్!

విధేయతకు దక్కనున్న అరుదైన గౌరవం?

IMG-20260304-WA0119​అశ్వారావుపేట, లోకల్ గైడ్ : 

రాజకీయాల్లో పదవుల కంటే పార్టీ సిద్ధాంతాలకు, నాయకత్వ నమ్మకానికి విలువ ఇచ్చే నాయకులు అరుదుగా ఉంటారు. ఆ కోవకే చెందుతారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు షేక్ పాషా. అధికారం ఉన్నా లేకపోయినా, కష్టకాలంలో పార్టీ జెండాను భుజాన మోసిన ఆయన, ఇప్పుడు అశ్వారావుపేట మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యునిగా బాధ్యతలు స్వీకరించేందుకు అర్హత కలిగిన బలమైన అభ్యర్థిగా నిలుస్తున్నారు. త్యాగం, క్రమశిక్షణ, గెలుపు గుర్రం!
​గత మున్సిపల్ ఎన్నికల్లో 10వ వార్డు నుండి పోటీ చేయాలని షేక్ పాషా ఆశించినప్పటికీ, పార్టీ ప్రయోజనాల దృష్ట్యా, స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సూచన మేరకు తన అభ్యర్థిత్వాన్ని వెనక్కి తీసుకున్నారు. టికెట్ దక్కలేదన్న అసంతృప్తిని ప్రదర్శించకుండా, పార్టీ క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా 11వ వార్డు ఇంచార్జ్ బాధ్యతలను స్వీకరించారు. అంతేకాకుండా, 11వ వార్డు అభ్యర్థి నార్లపాటి మహేష్ విజయం కోసం అహర్నిశలు శ్రమించి, 206 ఓట్ల భారీ మెజారిటీతో ఆయన గెలుపులో కీలక పాత్ర పోషించారు. ​గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ పార్టీ నుంచి మండల పరిషత్ కో-ఆప్షన్ సభ్యునిగా గెలుపొందిన పాషా, ఐదేళ్ల పాటు పాలకపక్షాన్ని నిలదీస్తూ ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ గళం వినిపించారు. కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన ప్రతి ఉద్యమంలోనూ ముందుండి, పార్టీ ఉనికిని చాటారు. అశ్వారావుపేట రాజకీయాల్లో ఆయనకున్న పట్టు, ఐదేళ్ల కో-ఆప్షన్ సభ్యునిగా ఉన్న అనుభవం మున్సిపాలిటీ అభివృద్ధికి ఎంతో దోహదపడతాయని స్థానిక కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుల ఎంపికలో తనకు అవకాశం కల్పిస్తామని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మొగళ్లపు చెన్నకేశవరావు సమక్షంలో ఇచ్చిన మాట ప్రకారం పాషాకు అశ్వారావుపేట మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులుగా ఎన్నిక కానున్నట్లు తెలుస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మరియు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ నాయకత్వంలో నిజాయితీగా పనిచేసే కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మాట ఇస్తే మడమ తిప్పరని కార్యకర్తలు భావిస్తున్నారు. ​ప్రస్తుతం మున్సిపాలిటీలో ఇద్దరు కో-ఆప్షన్ సభ్యులకు అవకాశం ఉండగా ముస్లిం కోఆప్షన్ సభ్యులుగా షేక్ పాషాకు అరుదైన అవకాశం దక్కనుంది. ఏది ఏమైనా, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసిన పాషా వంటి నాయకులకు అవకాశం రావడం కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Tags:

About The Author

Latest News