మిడ్జిల్ లో అంబేద్కర్ జయంతి ఏర్పాట్లకు శ్రీకారం

ఉత్సవ కమిటీ అధ్యక్షులుగా బరిగెల వెంకటయ్య ఎంపిక

మిడ్జిల్ లో అంబేద్కర్ జయంతి ఏర్పాట్లకు శ్రీకారం



మిడ్జిల్, మార్చి 7: (లోకల్ గైడ్ ):

మండల కేంద్రంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. సంఘ అధ్యక్షులు దేవయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఉత్సవ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
సమావేశంలో అంబేద్కర్ ఆశయాలను యువతకు చేరవేసేందుకు వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. మండల కేంద్రంలో అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించడంతో పాటు ఆయన రచనలతో కూడిన గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని నాయకులు తెలిపారు.
ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ అధ్యక్షులుగా బరిగెల వెంకటయ్య, గౌరవ అధ్యక్షులుగా బరిగెల బాలయ్య, ఉపాధ్యక్షులుగా బుచ్చయ్య, మావిళ్ళ వెంకటయ్య, ప్రధాన కార్యదర్శిగా బరిగెల వెంకట్ సాగర్, కోశాధికారిగా బరిగెల సుదర్శన్, సహాయ కార్యదర్శిగా బరిగెల దేవరాజ్, ప్రచార కార్యదర్శిగా బరిగెల రవీంద్రలను ఎన్నుకున్నారు.
సలహాదారులుగా బరిగెల దానియల్, బరిగెల రాములు, బరిగెల వెంకటయ్య, ఎర్రోళ్ల మల్లేష్, మన్యం, కురుమయ్య తదితరులు పాల్గొన్నారు.
అంబేద్కర్ జయంతిని మండలంలో ఘనంగా నిర్వహించేందుకు గ్రామస్తులు, యువత సహకరించాలని నాయకులు కోరారు

Tags:

About The Author

Latest News