వసతి గృహాల్లో వంద శాతం ప్రవేశాలు కల్పించాలి.
రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి శాఖ అడిషనల్ డైరెక్టర్ శ్రీధర్ ఆదేశం
నిర్మల్ జిల్లా ప్రతినిధి.
ఏప్రిల్ 7 (లోకల్ గైడ్):
అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వసతి గృహ సంక్షేమ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ.. వసతి గృహాల్లో ఇంటర్నెట్ సౌకర్యం కల్పించి, విద్యార్థులకు డిజిటల్ తరగతులు నిర్వహించాలని స్పష్టం చేశారు. ప్రతి నెలా విద్యార్థులకు తప్పనిసరిగా వైద్య పరీక్షలు నిర్వహించేలా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని, అలాగే ప్రతి రెండు నెలలకోసారి సమావేశం నిర్వహించి నాణ్యమైన ఆహారం అందేలా పర్యవేక్షించాలని ఆదేశించారు.
ప్రీ-మెట్రిక్ స్కాలర్‌షిప్ రిజిస్ట్రేషన్ల సంఖ్యను పెంచాలని, వివిధ విభాగాల్లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను తక్షణమే పరిష్కరించి వివరాలను ప్రధాన కార్యాలయానికి పంపాలని సూచించారు. అలాగే జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల సమీక్ష, ఎస్సీ స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్, మ్యాన్యువల్ స్కావెంజర్స్ కమిటీ సమావేశాలను ప్రతి మూడు నెలలకు ఒకసారి విధిగా నిర్వహించాలని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారి సునీత, ASWOలు నారాయణ రెడ్డి, నర్సింగ్, వసతి గృహ సంక్షేమ అధికారులు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
