ప్రజలకు నాణ్యమైన సేవలందించిన వైద్య సిబ్బందికి గౌరవం ప్రతిభకు పురస్కారాలు

చర్ల గిరిజన ప్రాంతాల్లో ఉత్తమ సేవలకు  “బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇన్ ట్రైబల్ ఏరియా” విభాగంలో  3  అవార్డులు 

ప్రజలకు నాణ్యమైన సేవలందించిన వైద్య సిబ్బందికి గౌరవం ప్రతిభకు పురస్కారాలు

 

 

కొత్తగూడెం/చర్ల : లోకల్ గైడ్ :
99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ప్రకటించిన అవార్డుల్లో గిరిజన జిల్లా భద్రాద్రి కొత్తగూడెం విశిష్ట స్థానం సంపాదించింది. జిల్లా డీసీహెచ్‌ఎస్ డా. రవి బాబు పరిధిలోని వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) ఆసుపత్రులు అత్యధిక అవార్డులు సాధించడం విశేషం. గిరిజన ప్రాంతాల్లో ప్రజలకు నాణ్యమైన, సమయోచిత వైద్య సేవలు అందించడంలో చూపిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డులు లభించాయి. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చేతుల మీదుగా హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఈ అవార్డుల ప్రదానం జరిగింది. కార్యక్రమంలో ఆరోగ్య కార్యదర్శి క్రిస్టినా, ఫ్యామిలీ & హెల్త్ కమిషనర్ సంగీత, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌తో పాటు పలు విభాగాధిపతులు పాల్గొన్నారు.
అవార్డులు అందుకున్న వారిలో సీహెచ్‌సీ పాల్వంచకు చెందిన డా శైలేష్ కుమార్ (ఆర్థో), డా పి రామ్ ప్రసాద్ (అనస్తీషియా), ఏరియా హాస్పిటల్ భద్రాచలం నుంచి డా క్రపా విజయ్ (పెడియాట్రిక్స్), నర్సింగ్ ఆఫీసర్ కృష్ణవేణి ఉన్నారు. అలాగే ఏబీఏఎస్ సేవలలో ఎ వెంకటరావు (98 శాతం) ప్రతిభ కనబరిచారు. ల్యాబ్ సేవల విభాగంలో భద్రాచలం మెడికల్ సూపరింటెండెంట్ డా. రామకృష్ణకు గుర్తింపు లభించింది. ఏరియా హాస్పిటల్ మణుగూరు నుంచి నర్సింగ్ ఆఫీసర్ మానస, సీఎంఎస్ ఇంచార్జ్ ఫార్మాసిస్ట్ గ్రేడ్–I ఏ. శారధ అవార్డులు అందుకున్నారు. అదనంగా భద్రాచలం, మణుగూరు, చర్ల వంటి గిరిజన ప్రాంతాల్లో ఉత్తమ సేవలందించినందుకు “బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇన్ ట్రైబల్ ఏరియా” విభాగంలో డీసీహెచ్‌ఎస్ డా జీ రవి బాబు, సూపరింటెండెంట్లు రామకృష్ణ, గౌరీప్రసాద్, సాయి వర్ధన్‌లతో కలిసి మూడు అవార్డులు అందుకున్నారు. జిల్లా టీవీవీపీ ఆసుపత్రులు ఇప్పటికే పలు సందర్భాల్లో రాష్ట్ర స్థాయిలో ప్రశంసలు పొందగా, ఈ తాజా అవార్డులు గిరిజన ప్రజలకు అందిస్తున్న ఉత్తమ వైద్య సేవలకు మరో గొప్ప గుర్తింపుగా నిలిచాయి.

Tags:

About The Author

Latest News

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మజ్జిగ పంపిణీ. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మజ్జిగ పంపిణీ.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి,ఏప్రిల్ 07  లోకల్ గైడ్  వరంగల్,రామన్నపేట లోని డాక్టర్.ఏ. రాజేంద్రప్రసాద్ భారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకొని ప్రభుత్వ...
భూసేకరణ పరిహారం పై తెర 
వసతి గృహాల్లో వంద శాతం ప్రవేశాలు కల్పించాలి.
వరల్డ్ హెల్త్ డే సందర్భంగా కొయ్యూరు పీహెచ్‌సీలో అవగాహన ర్యాలీ
ప్రజలకు నాణ్యమైన సేవలందించిన వైద్య సిబ్బందికి గౌరవం ప్రతిభకు పురస్కారాలు
ప్రమాదవశాత్తు చెరువులో పడి  విద్యార్థి మృతి....
జడ్చర్ల రూరల్ సీఐగా కే.మహేష్ బాధ్యతల స్వీకారం