విద్యుత్ కార్మికుల  మహాధర్నా

విద్యుత్ కార్మికుల  మహాధర్నా

హనుమకొండ జిల్లా ప్రతినిధి,ఏప్రిల్ 07లోకల్ గైడ్ 
            హనుమకొండ,విద్యుత్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం టీవీఏఈ జేఏసీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హనుమకొండ నక్కలగుట్టలోని ఎన్పీడీసీఎల్ సర్కిల్ కార్యాలయం వద్ద మహాధర్నా నిర్వహించారు. రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ మహా ధర్నాకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ కేంద్రాల నుంచి అన్మేనేడ్, ఆర్టిజన్, పీస్ వర్క్, కార్మికులు భారీగా తరలివచ్చారు.ఈ మహాధర్నాకు జేఏసీ రాష్ట్ర చైర్మన్ సుంకు సతీష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 327 యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇనుగాల శ్రీధర్, టీఆర్వీకేఎస్ యూనియన్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు మాడ దేవేందర్ రెడ్డి, ఈశ్వర్ లాల్, బీఎంఎస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శశికుమార్ పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆర్టిసన్, అన్మన్డ్, పీస్ వర్క్ కార్మికులకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. తక్షణమే యాజమాన్యం జేఏసీ నాయకులను చర్చలకు ఆహ్వానించి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఈనెల 8 నుండి సమ్మె చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో 327 యూనియన్ ఎన్పీడీసీఎల్ కంపెనీ ప్రెసిడెంట్ మహేందర్ రెడ్డి, టీఆర్వీకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరేంద్రపాల్, ఎన్పీడీసీఎల్ సెక్రటరీ బండారి ప్రభాకర్, కోటి, సదయ్య, ఓదెలు, బీఎంఎస్ నాయకుడు రమణారెడ్డి,బీసీ విద్యుత్ ఉద్యోగుల సంఘం నాయకులు రంగు సత్యనారాయణ, చంద్రమౌళి, 1104 యూనియన్ నాయకులు హరిహరచారి, సురేష్, జేఏసీ ట్రాన్స్కో రాష్ట్ర కన్వీనర్ కదికొండ వెంకటేష్, హనుమకొండ జిల్లా చైర్మన్ రాంబాబు, అన్మన్డ్ కార్మిక నాయకులు బిక్షపతి, ఎన్.రాంబాబు, పూర్ణచారి, వరుణ్, ప్రవీణ్, ట్రాన్స్కో చైర్మన్ శ్రీనాథ్, ఉమ్మడి జిల్లా ట్రా న్స్కో చైర్మన్ ఐలయ్య, కన్వీనర్ కొర్ర రాజన్న, కోకన్వీనర్లు సృజన, రాజేష్, ఎన్పీడీసీఎల్ నాయకులు శ్రీధర్, సాగర్, సతీష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ కూటమికి మహిళలే బుద్ధి చెబుతారు బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ కూటమికి మహిళలే బుద్ధి చెబుతారు
నారాయణపేట ఏప్రిల్ 17: కేంద్ర ప్రభుత్వం దశాబ్దాల కాలంగా మహిళలు ఎదురుచూస్తున్న మహిళా బిల్లును పార్లమెంట్ లో ప్రవేశ పెడితే ఆబిల్లు ను క్రూరంగా కాంగ్రెస్ కూటమి...
ఎండాకాలం జాగ్రత్తలు తెలియజేయాలి.
రోడ్డు భద్రత నియమాలు పాటిస్తేనే ప్రమాదాల నివారణ. రాష్ట్ర రైల్వే, రోడ్డు భద్రత ఐజీపీ రమేష్ నాయుడు ఐపీఎస్ సాధ్యం.
విద్యుత్ వినియోగదారులకు కొత్త సర్వీసుల మంజూరు
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి .....జిల్లా కలెక్టర్ అంకిత్
అన్నారం లో అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం
ప్రభుత్వ తీరుపై ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల గర్జన!