ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం...
సుల్తానాబాద్ పట్టణాన్ని అద్దంలా చేస్తా...
మళ్లీ ఓట్లకు వచ్చేలోగా ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తా...
,ఏప్రిల్.07..(లోకల్ గైడ్)
సుల్తానాబాద్ పట్టణంలోని రిక్రియేషన్ క్లబ్ ఆవరణలో మంగళవారం రోజున ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన10 వ వార్డు సభలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ. చింతకుంట విజయరమణా రావు ...
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయరమణా రావు మాట్లాడుతూ...
రైతు బీమా మాదిరిగా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి బీమా సదుపాయాన్ని కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇట్టి పథకాన్ని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి దినోత్సవం అయినటువంటి జూన్ 2న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభిస్తారని చెప్పారు. రానున్న రోజుల్లో విద్యార్థులకు ప్రభుత్వ బడులలో చదివి విద్యార్థులకు అల్పాహారం, ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం సమకూర్చేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోందని చెప్పారు. ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం, రుణమాఫీ, ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, వడ్డీ లేని రుణాలు అంటే ఎన్నో సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. అభివృద్ధి విషయంలో సుల్తానాబాద్ పట్టణాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. రానున్న శాసనసభ ఎన్నికల నాటికి ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి తీరుతానని, ప్రజల ఆశీస్సులతో తాను ఆ ధీమా తో పనిచేస్తున్నట్టు చెప్పారు. సుల్తానాబాద్ పట్టణాన్ని అద్దంలాగా తయారు చేస్తానని చెప్పారు. ఇప్పటికే సుద్దాల పట్టణంలో కోట్లాది రూపాయలతో రోడ్ల విస్తరణ, ఆధునికరణ చేసి అందంగా తీర్చిదిద్దినట్టు చెప్పారు. అంబేద్కర్ విగ్రహం నుండి ఎంపీడీవో కార్యాలయం వరకు ఆధునికరించిన బీటీ రోడ్డు, డివైడర్, సెంట్రల్ లైటింగ్ ను త్వరలోనే ప్రారంభిస్తానని చెప్పారు. మరి కొద్ది రోజుల్లో అర్హులైన వారి అందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయనున్నట్టు చెప్పారు. సుల్తానాబాద్ పట్టణంలో చాలామంది ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయిన లబ్ధిదారులు పనులు ప్రారంభించలేదని, ఈ దిశగా అధికారులు అవసరమైన ప్రయత్నాలు చేయటం లేదని ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక మున్సిపల్ కమిషనర్ వెంటనే రివ్యూ చేయాలని ఆదేశించారు.
