చెన్నూరును ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం...

మంత్రి గడ్డం వివేక్...

చెన్నూరును ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం...

IMG-20260227-WA0099మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)


చెన్నూరు మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా అన్ని విధాల అభివృద్ధి చేస్తామని రాష్ట్ర మైనింగ్ కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ తెలిపారు.మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీలో నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్‌పర్సన్ పెద్దింటి పద్మ పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా చైర్‌పర్సన్‌తో పాటు పాలకవర్గ సభ్యులకు మంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం మంత్రి మాట్లాడుతు చెన్నూరు కాంగ్రెస్ నాయకులను గెలిపించి మున్సిపాలిటీలో బాధ్యతలు అప్పగించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.కౌన్సిలర్లు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండి,వారి సమస్యలను తెలుసుకొని వెంటనే పరిష్కరించే దిశగా పని చేయాలని సూచించారు.చెన్నూరు మున్సిపాలిటీలో సుమారు 50కోట్ల నిధులతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు.అనేక వార్డుల్లో బోర్‌వెల్స్,సీసీ రోడ్లు,సైడ్ డ్రైన్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అమృత్ 2.0 పథకం ద్వారా ఇంటింటికి తాగునీరు అందజేస్తామని హామీ ఇచ్చారు.గత ప్రభుత్వం మిషన్ భగీరథ పేరిట నిధులను దుర్వినియోగం చేసిందని విమర్శించిన మంత్రి,చెన్నూరు పట్టణ ప్రజలకు గోదావరి నుండి శుద్ధజలాల పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు.త్వరలో పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు కూడా చేపడతామని తెలిపారు.అదేవిధంగా పట్టణంలోని కుల సంఘాల భవనాల నిర్మాణానికి ఇప్పటికే నిధులు కేటాయించినట్లు తెలిపారు.మరో 6నెలల్లో గోదావరి ఇసుకను అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు.మారెమ్మవాడలో రహదారి సమస్యను పరిష్కరించామని గుర్తుచేశారు.మున్సిపాలిటీలో మరో 100కొత్త ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు తెలిపారు.ఇందిరమ్మ ఇళ్ల సమస్యలపై కేబినెట్‌లో చర్చలు జరిపినట్లు పేర్కొన్నారు.దేవులవాడ,బబ్బేరు,చెలుక గ్రామాల రైతులకు సుమారు18కోట్ల పరిహారం మంజూరు చేసి పంపిణీ చేసినట్లు వివరించారు.మే నెలలో 100పడకల ఆసుపత్రిని ప్రారంభించనున్నట్లు తెలిపారు.అంతేకాకుండా కోటి ఇరవై లక్షల రూపాయలతో శ్మశానవాటిక అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.చెన్నూరులోని ప్రతి వార్డులో సమన్వయంతో పని చేసి మున్సిపాలిటీనీ ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుదామని మంత్రి పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

పదో తరగతి విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ పదో తరగతి విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ
లోకల్ గైడ్ : కొడంగల్: సమాజ సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న అమ్మ నాన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంగడి రాయచూరు గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ హైస్కూల్‌లో చదువుతున్న పదో...
మార్షల్ ఆర్ట్స్ స్పోర్ట్స్ అసోసియేట్ వారి ఆధ్వర్యంలో మూడవ జాతీయ స్థాయి ఛాంపియన్షిప్ పోటీలు.
ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి  ఆధ్వర్యంలో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం కుటుంబాలకు సత్తుపల్లి పాత సెంటర్
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నూతి సత్యనారాయణ  ఆదేశాలు అఖిలభారత
మహిళా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత...
పెంచిన వంట గ్యాస్ ధరల్ని తగ్గించాలి.
వ్యవసాయ యాంత్రికీకరణ పథకంలో రైతులకు పరికరాల పంపిణీ