గచ్చిబౌలి స్పోర్ట్స్ హాకథాన్‌లో ‘మ్యాచ్ పాయింట్ బ్యాడ్మింటన్ అకాడమీ’ ఘన విజయం
గచ్చిబౌలి స్టేడియంలో ఇటీవల అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 'స్పోర్ట్స్ హాకథాన్'లో మ్యాచ్ పాయింట్ బ్యాడ్మింటన్ అకాడమీ క్రీడాకారులు అద్భుత ప్రదర్శన కనబర్చి పలు పతకాలను కైవసం చేసుకున్నారు. సుమారు 20కి పైగా క్రీడా విభాగాల్లో నిర్వహించిన ఈ పోటీల్లో అకాడమీకి చెందిన యువ షట్లర్లు తమ ప్రతిభతో అందరినీ ఆకట్టుకున్నారు.
విజేతల వివరాలు:
అండర్-9 విభాగం: సాన్వి చేలూరి అసాధారణ ప్రతిభను చాటి అండర్-9 సింగిల్స్ మరియు డబుల్స్ విభాగాల్లో టైటిళ్లను గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసింది.
అండర్-13 బాలుర విభాగం: శ్రీ లిఖిత్ మరియు అద్వైత్ సంబరి జోడి అద్భుతమైన సమన్వయంతో ఆడి ఫైనల్స్‌కు చేరుకుని, రన్నరప్ (వెండి పతకం) స్థానాన్ని దక్కించుకున్నారు.
అండర్-15 బాలికల విభాగం: ఈ టోర్నీలో సాన్వి లట్టాల ప్రదర్శన హైలైట్‌గా నిలిచింది. సెమీఫైనల్‌లో ఒడిశా క్రీడాకారిణి అర్చిసా పండాపై 15-07తో విజయం సాధించిన సాన్వి, ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్‌లో సాయి (SAI) గచ్చిబౌలికి చెందిన టాప్ ర్యాంకర్ తనిష్ట శ్రీనివాస్‌పై 15-11 స్కోరుతో గెలిచి ఛాంపియన్‌గా నిలిచింది.
కోచ్ అభినందనలు:
క్రీడాకారుల విజయంపై అకాడమీ హెడ్ కోచ్, జాతీయ స్థాయి క్రీడాకారుడు వేణు ముప్పాల హర్షం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. "మా అకాడమీ శిక్షణ నాణ్యతకు ఈ విజయాలే నిదర్శనం. యువ క్రీడాకారులను ఛాంపియన్‌లుగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం. క్రీడాకారుల్లో క్రమశిక్షణ, నైపుణ్యాన్ని పెంచేందుకు మేము నిరంతరం కృషి చేస్తాం," అని తెలిపారు.
సమ్మర్ కోచింగ్ క్యాంప్ ప్రకటన:
వ్యాసవి సెలవులను పురస్కరించుకుని మ్యాచ్ పాయింట్ అకాడమీ ఏప్రిల్ 5 నుండి జూన్ 5 వరకు ప్రత్యేక 'సమ్మర్ కోచింగ్ క్యాంప్'ను నిర్వహిస్తోంది. ప్రొఫెషనల్ శిక్షణ పొందాలనుకునే ఆసక్తిగల క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అకాడమీ యాజమాన్యం కోరింది.
