పదవ తరగతి పరీక్షా కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్

పదవ తరగతి పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ కె. హైమావతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

పదవ తరగతి పరీక్షా కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్

సిద్ధిపేట జిల్లా ప్రతినిధి మార్చి14:(లోకల్ గైడ్ తెలంగాణ)

సిద్ధిపేట అర్బన్ మండలం రంగధాంపల్లి గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, నంగునూరు మండలం రాజగోపాల్‌పేట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పదవ తరగతి పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ కె. హైమావతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా పరీక్షా కేంద్రాలలో జరుగుతున్న ఏర్పాట్లు, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. ఎస్‌ఎస్‌సి–2026 బోర్డు మార్గదర్శకాల ప్రకారం పరీక్షలను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాలని, విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా విధులు నిర్వహించాలని చీఫ్ సూపరింటెండెంట్‌ను ఆదేశించారు.
పరీక్ష గదుల్లో ఎలాంటి పుస్తకాలు, చార్ట్‌లు లేదా ఇతర సమాచార పత్రాలు ఉండకూడదని, ఎక్కడా మాస్ కాపీయింగ్ జరగకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణ ఉండాలని సూచించారు. పరీక్షా కేంద్రంలోకి మొబైల్ ఫోన్లు అనుమతించరాదని, పూర్తిగా తనిఖీ చేసిన తరువాతే విద్యార్థులను లోపలికి అనుమతించాలని తెలిపారు.అదేవిధంగా పరీక్షా కేంద్రం పరిసరాల్లో సెక్షన్ 144 అమలు చేయడంతో పాటు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

Tags:

About The Author

Latest News