355వ నేత్రదానం .

355వ నేత్రదానం .

 

నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి. ఏప్రిల్ 8 .(లోకల్ గైడ్).

తెలంగాణ మ్యాథ్స్ ఫోరం నల్లగొండ శాఖకు అనుక్షణం బాసటగా ఉంటూ,  డిస్టిక్ రిసోర్స్ పర్సన్  గా, గణితాభిలాష‌ కలిగిన గణిత టీచర్ గా, విద్యార్థుల భవిష్యత్తు కోసం అనుక్షణం తపించిన శ్రీపతి యాదయ్య మరణం వారి కుటుంబానికే కాదు‌, తీవ్రమైన లోటు.. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ కఠినమైన పరిస్థితుల్లో ఆత్మ నిర్భరంతో, లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ఐ డొనేషన్ సెంటర్ వారు అడిగిన వెంటనే, ముందుకు వచ్చి  నేత్రదానానికి సహకరించారు. శ్రీపతి యాదయ్య   స్వర్గస్తులు కాగా,  రోడ్ నెంబర్ 6 రాక్ హిల్స్ కాలనీలోని తమ స్వగృహం నందు నేత్రదాన ప్రక్రియ ద్వారా కార్నియా అను కంటిపొర లను సేకరించి, ఇద్దరు కార్నియల్ అంధులకు కంటిచూపును ప్రసాదించే మహోన్నతమైన దానాన్ని చేశారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు ఐ డొనేషన్ సెంటర్ మేనేజర్ డాక్టర్ పుల్లారావు  మాట్లాడుతూ ప్రతి నేత్రదానం ఇద్దరు కార్నియల్ అంధులకు కంటిచూపును ప్రసాదిస్తుందని ఇప్పటివరకు తమ ఆధ్వర్యంలో 355 నేత్రదానాల ద్వారా 710 కార్నియా అను కంటే పరులను సేకరించడం ద్వారా ఎంతోమంది కార్నియల్ అంధులకు కంటిచూపును అందించే అవకాశం తమకు కలిగినదని తెలిపారు. ఎంతో బాధాకరమైన సందర్భంలో కూడా నేత్రదానానికి ముందుకు వచ్చిన వీరి శ్రీమతి శోభ,  వీరి కుమార్తె, కుమారుడు  బంధు మిత్రులందరికీ తమ ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నామని ట్రస్ట్ చైర్మన్ లయన్ కెవి ప్రసాద్ తెలిపారు.నేత్రదానంపై మరింత సమాచారం కొరకు తమ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ చిరునోముల ను 9948143299 వద్ద సంప్రదించాలని, మరణానంతరం 6 నుండి 8 గంటలలోగా నేత్రదానం చేయించాలని ఒకవేళ పార్థివదేహాన్ని ఫ్రీజర్ బాక్స్ లో ఉంచినట్లయితే 15 గంటలలోగా నేత్రదానం చేయించాలని ఐ డొనేషన్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హరనాథ్ కడిమి తెలిపారు.
.

Tags:

About The Author

Latest News

బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ కూటమికి మహిళలే బుద్ధి చెబుతారు బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ కూటమికి మహిళలే బుద్ధి చెబుతారు
నారాయణపేట ఏప్రిల్ 17: కేంద్ర ప్రభుత్వం దశాబ్దాల కాలంగా మహిళలు ఎదురుచూస్తున్న మహిళా బిల్లును పార్లమెంట్ లో ప్రవేశ పెడితే ఆబిల్లు ను క్రూరంగా కాంగ్రెస్ కూటమి...
ఎండాకాలం జాగ్రత్తలు తెలియజేయాలి.
రోడ్డు భద్రత నియమాలు పాటిస్తేనే ప్రమాదాల నివారణ. రాష్ట్ర రైల్వే, రోడ్డు భద్రత ఐజీపీ రమేష్ నాయుడు ఐపీఎస్ సాధ్యం.
విద్యుత్ వినియోగదారులకు కొత్త సర్వీసుల మంజూరు
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి .....జిల్లా కలెక్టర్ అంకిత్
అన్నారం లో అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం
ప్రభుత్వ తీరుపై ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల గర్జన!