ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు పూర్తీ

ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు పూర్తీ

ఇబ్రహీంపట్నం ఏప్రిల్ 4(లోకల్ గైడ్)

ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో ఎప్పటినుంచో వాయిదా పడుతూ వచ్చిన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలకు శనివారం తెరపడింది. ఎన్నికల కమిషన్ నిర్ణయించిన సమయానికి మొత్తం 24 మంది మున్సిపల్ కౌన్సిలర్లు కార్యాలయానికి హాజరయ్యారు. ఎక్స్-ఆఫీషియో ఓటు హక్కుతో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి కూడా పాల్గొన్నారు.ఎన్నికల ప్రారంభానికి ముందు కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఎన్నికల అధికారులతో వాగ్వాదానికి దిగారు. కోర్టులో మూడు పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోలేదని, ఎన్నికలు పారదర్శకంగా జరగడం లేదని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేతో పాటు పది మంది కౌన్సిలర్లు ఎన్నికలను బహిష్కరిస్తూ వాకౌట్ చేశారు.
అయితే, బిఆర్ఎస్ పార్టీకి మెజారిటీ కోరం ఉండటంతో ఎన్నికల ప్రక్రియ కొనసాగింది. రిటర్నింగ్ అధికారి కృష్ణారెడ్డి సూచనల మేరకు సుదర్శన్ రెడ్డి పేరును ప్రతిపాదించగా, 14 మంది సభ్యులు మద్దతు తెలపడంతో ఆయనను చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
వైస్ చైర్మన్ పదవికి ముత్యాల శ్యామల ఆమెకు కూడా 14 ఓట్లు లభించాయి. దీంతో ఆమెను వైస్ చైర్మన్‌గా ప్రకటించారు. ఇచ్చిన హామీ ప్రకారం బిఆర్ఎస్ పార్టీ వైస్ చైర్మన్ పదవిని బీజేపీకి కేటాయించడం విశేషం.
ఎన్నికల అనంతరం మున్సిపాలిటీ కార్యాలయానికి చేరుకున్న బిఆర్ఎస్ నాయకులు—మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి తదితరులు.

Tags:

About The Author

Latest News

బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ కూటమికి మహిళలే బుద్ధి చెబుతారు బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ కూటమికి మహిళలే బుద్ధి చెబుతారు
నారాయణపేట ఏప్రిల్ 17: కేంద్ర ప్రభుత్వం దశాబ్దాల కాలంగా మహిళలు ఎదురుచూస్తున్న మహిళా బిల్లును పార్లమెంట్ లో ప్రవేశ పెడితే ఆబిల్లు ను క్రూరంగా కాంగ్రెస్ కూటమి...
ఎండాకాలం జాగ్రత్తలు తెలియజేయాలి.
రోడ్డు భద్రత నియమాలు పాటిస్తేనే ప్రమాదాల నివారణ. రాష్ట్ర రైల్వే, రోడ్డు భద్రత ఐజీపీ రమేష్ నాయుడు ఐపీఎస్ సాధ్యం.
విద్యుత్ వినియోగదారులకు కొత్త సర్వీసుల మంజూరు
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి .....జిల్లా కలెక్టర్ అంకిత్
అన్నారం లో అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం
ప్రభుత్వ తీరుపై ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల గర్జన!