కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ విధానం రద్దు చేయాలి.

దేశ వ్యాప్త సమ్మెలో మున్సిపల్ కార్మికులు.

కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ విధానం రద్దు చేయాలి.


 నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి .ఫిబ్రవరి 12. లోకల్ గైడ్


   కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ విధానాన్ని రద్దుచేసి కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని *తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) జిల్లా కార్యదర్శి ఎండి సలీం సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య లు పిలుపునిచ్చారు.
    గురువారం దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ఉదయం ఐదు గంటలకు పారిశుధ్య పనులు నిలిపివేసి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దుచేసి తెచ్చిన నాలుగు లేబర్ కోళ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ థర్డ్ పార్టీ ఫిక్స్డ్ టర్మ్ పార్ట్ టైం డైలీ వేజ్ తదితర పేర్లతో కార్మికుల కష్టాన్ని దోచుకుంటుందని ఈ విధానాలన్నీ రద్దుచేసి కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు అప్పటిలోపు సమాన పనికి సమాన వేతనం అమలు జరపాలని విజ్ఞప్తి చేశారు కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను రద్దుచేసి కార్పొరేట్లకు అనుకూలంగా అవలంబిస్తున్న బిజెపి కేంద్ర ప్రభుత్వ విధానాలను కార్మిక వర్గం వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు వ్యవసాయ కార్మికుల రైతుల హక్కులను హరించి వేసే విధంగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలపై రైతాంగం వ్యవసాయ కార్మికులు కార్మికులు పెద్ద ఎత్తున సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.నల్లగొండ నల్లగొండ పట్టణంలో  ఆర్టీసీలో ఎల్ఐసి బిఎస్ఎన్ఎల్ పవర్లూమ్స్ పద్మ నగర్ అర్జాల బావి ప్రాంతాలలో సమ్మె చేసి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఎస్డబ్ల్యుఎఫ్ జిల్లా అధ్యక్షులు కందుల నరసింహ సహాయ కార్యదర్శి కే శ్యాంసుందర్ డిపో కార్యదర్శి గులాం రసూల్ పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు గంజి నాగరాజు కార్యదర్శి సూరపల్లి భద్రయ్య ఆర్జాలబాయి ఏరియా అధ్యక్షులు పెండెం బుచ్చి రాములు కార్యదర్శి దేవులపల్లి గిరిబాబు పవర్లూమ్ మహిళా అధ్యక్ష కార్యదర్శులు మూడో చంద్రకళ మిరియాల శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు
              సిఐటియు పట్టణ కన్వీనర్ అవుట రవీందర్ అధ్యక్షతన జరిగిన సభలో తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు చింతకాయల సంతోష్ పట్టణ కార్యదర్శి పెరిక కృష్ణ వర్కింగ్ ప్రెసిడెంట్ పేర్ల సంజీవ ఉపాధ్యక్షులు జీడిమెట్ల నరసింహ సహాయ కార్యదర్శి పందుల లింగయ్య పగిళ్ల రాములు ఐ ఎన్ టి యు సి పట్టణ నాయకులు లతీఫ్ ఎర్ర శ్రీనివాస్ అండాలు శ్రావణ్ కుమార్ రమేష్ యాదమ్మ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

తల్లికి నివాళి –అమ్మానాన్న వృద్ధాశ్రమంలో అన్నదానంతో తల్లికి నివాళి –అమ్మానాన్న వృద్ధాశ్రమంలో అన్నదానంతో
కుత్బుల్లాపూర్ ఫిబ్రవరి 26 (లోకల్ గైడ్ ప్రతినిధి) తల్లిని స్మరించుకోవడం అనేది కేవలం కుటుంబ అనుబంధం మాత్రమే కాదు, సమాజానికి స్ఫూర్తినిచ్చే విలువైన కర్తవ్యమని చాటి చూపారు...
రాష్ట్ర బిజెపి చీఫ్ ను కలిసిన పేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్వేతా 
ఘనంగా మామిడి జనార్దన్ రెడ్డి కూతురు వివాహం
కారేపల్లి మండలం మాదారం గ్రామ సెంటర్ లో 
ఆల్ బ్యాంకు మిత్ర అసోసియేషన్  ఆఫ్ ఇండియా 
15వ వార్డులో బోర్వెల్ కు మరమ్మతులు...
అంగన్వాడీకేంద్రంలో తనిఖీ చేసిన సర్పంచ్ రాజమణి