గొప్ప దైవజనులు బిషప్ సి. హెచ్. జయరాజు ఇక సెలవు* సి.ఎఫ్. జి. చర్చ్ - నార్కట్ పల్లి
ఘన వీడ్కోలు పలికిన వేలాది క్రైస్తవులు బిషప్ దుర్గం ప్రభాకర్
తెలంగాణ రాష్ట్ర క్రైస్తవ నాయకులు
నల్లగొండ ఉమ్మడి జిల్లా . ఫిబ్రవరి 16. (లోకల్ గైడ్):
నార్కట్ పల్లి మండల కేంద్రంలో సి. ఎఫ్. జి. చర్చ్ వ్యవస్థాపకులు గొప్ప దైవజనులు సీనియర్ పాస్టర్ బిషప్ సి. హెచ్. జయరాజు ( 62) గత కొంతకాలంగా ఆనారోగ్యం తో బసవతారక హాస్పిటల్ హైదరాబాద్ చికిత్స పొందుతూ నిన్న మధ్యాహ్నం మృతి చెందిన విషయం ఉమ్మడి నల్గొండ జిల్లాను కలిసివేసిందని వారి ప్రార్ధివ దేహానికి పూల మాల వేసి వారి కుటుంబాన్ని పరామర్శించిన తెలంగాణ రాష్ట్ర క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బిషప్ దుర్గం ప్రభాకర్, చార్లెట్ చారిటబుల్ ఫౌండేషన్ సూర్యాపేట వ్యవస్థాపకులు బ్రదర్ జాటోత్ డేవిడ్ రాజు నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ వారికి భార్య రెచల్ ఇద్దరు కుమార్తెలు వున్నారని వేల మంది ఆత్మీయ బిడ్డలను సంపాదించారాని అన్నారు.ఈ కార్యక్రమం లో ఉమ్మడి నల్గొండ జిల్లా కన్వీనర్ పాస్టర్ చింత మనిషే, నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ క్రైస్తవ నాయకులు పోకల అశోక్, సీనియర్ నాయకులు మర్రి రాజు, నకిరేకల్ నియోజకవర్గ పెలోషిప్ పాస్టర్స్ అధ్యక్షులు రెవ. వేముల హనోక్, బిషప్ వై. సమర్పణ కుమార్ జాన్సీ రాణి ,తుంగతుర్తి నియోజకవర్గ అధ్యక్షులు బాకీ పరంజ్యోతి,చింత సుధాకర్,పాస్టర్ రావుల అమ్రామ్, పాస్టర్ ఏసురత్నం,పాస్టర్ జిల్లా సంసన్ పాస్టర్ జీవప్రకాష్ బల్లెం, పాస్టర్ నామ మోజెష్, కత్తుల యెహోవా దాసు తదితరులు పాల్గొన్నారు
