వీల్ చైర్ ద్వారా అమ్మవారి దర్శనం సులువు.
By Ram Reddy
On
గద్వాల, లోకల్ గైడ్ :
నడిగడ్డ భక్తుల ఇలవేల్పు కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారం జమ్మిచేడు శ్రీ జమ్ములమ్మ పరశురామ స్వామిని దర్శించుకునేందుకు శుక్రవారం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేవాలయంలో వయో వృద్ధులు, దివ్యాంగుల కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వీలు చైర్ లో వారిని కూర్చోబెట్టి అమ్మవారి దర్శనానికి తీసుకెళ్లి దేవాలయ సిబ్బంది సేవలందిస్తున్నారు. మల్లకల్ మండలం మల్లెం దొడ్డి గ్రామానికి చెందిన ఈజీకే తిరుమల రావు ను వీల్ చైర్ లో తీసుకెళ్లే అమ్మవారి దర్శనం చేయించారు. దేవాలయ ఈవో పురందర కుమార్ భక్తులకు అందుబాటులో ఉండి సేవలందించారు. కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్ర తదితర ప్రాంతాల అమ్మవారి భక్తులు తండోపతండాలుగా వచ్చి మొక్కులు సమర్పించారు.
Tags:
About The Author
Latest News
13 Feb 2026 19:18:55
శక్తి స్వరూపుడు శివాజీ మహారాజ్
*శివాజీస్ఫూర్తితో యువత ముందుకు సాగాలి*
*డాక్టర్ :శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామీ*
*ప్రతి గ్రామంలో హైందవ చైతన్యం రావాలి*...
