ఆచార్య జి. చెన్నకేశవ రెడ్డి 82వ జయంతి సందర్భంగా
సాహిత్య సాంస్కృతిక వేడుకలు ఘనంగా నిర్వహించారు
ఆచార్య జి. చెన్నకేశవ రెడ్డి 82వ జన్మదినాన్ని పురస్కరించుకుని జయమిత్ర సాహిత్య సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో ఘనమైన సాహిత్య సాంస్కృతిక కార్యక్రమం రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుప్రసిద్ధ కవి, లలిత గేయకళానిధి, రసమయి అధ్యక్షులు డా॥ ఎం.కె. రాముకి ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమం మంగళవారం సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లోని రవీంద్ర భారతి సమావేశ మందిరంలో నిర్వహించారు. సాహిత్య, సాంస్కృతిక రంగాలకు చెందిన ప్రముఖులు ఈ వేడుకకు హాజరై కార్యక్రమాన్ని మరింత విశిష్టంగా జరిగింది.సభకు అధ్యక్షత వహించనున్న డాక్టర్ అమ్మంగి వేణుగోపాల్, తెలంగాణ ప్రభుత్వ కాళోజీ నారాయణరావు తొలి పురస్కార గ్రహీతగా ప్రత్యేక గుర్తింపు పొందినవారు. సభను డా॥ ఏనుగు నరసింహారెడ్డి, ఐఏఎస్, తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతికశాఖ సంచాలకులు ప్రారంభించారు. .విశిష్ట అతిథులుగా డా॥ టి. గౌరీశంకర్, మాజీ రిజిస్ట్రార్ (సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం), అలాగే సుప్రసిద్ధ కవి, రచయిత డా॥ నాళేశ్వరం శంకరం పాల్గొన్నారు. గౌరవ అతిథులుగా ఆచార్య గంటా జలంధర్ రెడ్డి, తెలంగాణ భాషా సాంస్కృతిక మండలి అధ్యక్షులు, సుప్రసిద్ధ జర్నలిస్టు రచయిత చీకోలు సుందరయ్య, ప్రముఖ కవయిత్రి అమ్మంగి కవితాస్వామి, అలాగే ఎం. ఆనంద్ తదితరులు హాజరయ్యారు.ఈ సాహిత్య సదస్సుకు సమావేశ సంధానకర్తగా రా॥ అన్నం పొండయ్య వ్యవహరించారు. జయమిత్ర సాహిత్య సాంస్కృతిక వేదిక కార్యవర్గ సభ్యులు సాహిత్యాభిమానులు, రచయితలు, కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ కార్యక్రమం ద్వారా ఆచార్య చెన్నకేశవ రెడ్డి సాహిత్య సేవలను స్మరించుకోవడంతో పాటు, డా॥ ఎం.కె. రాముగారి సాహిత్య కృషిని గౌరవించటం ముఖ్య ఉద్దేశ్యమని నిర్వాహకులు తెలిపారు.
