పురపాలక సంఘం మొదటి బడ్జెట్ సమావేశం.
By Ram Reddy
On
(లోకల్ గైడ్ తెలంగాణ)
మిర్యాలగూడ మున్సిపల్ కార్యాలయం నందు మున్సిపల్ చైర్మన్ చిలుకూరి సుధా బాలకృష్ణ అధ్యక్షతన నిర్వహించిన పురపాలక సంఘం మొదటి బడ్జెట్ సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న శాసనసభ్యులు *బత్తుల లక్ష్మారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన మైసమ్మ తల్లి దేవాలయం దర్శించుకొని అనంతరం .. సమావేశం ప్రారంభించారు..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతన మున్సిపాలిటీ కౌన్సిల్ ఏర్పాటు అయిన తర్వాత ఏర్పాటు చేసిన మొదటి బడ్జెట్ సమావేశం కావున కౌన్సిలర్స్ అందరూ పార్టీలకు రాజకీయాలకు అతీతంగా పట్టణ అభివృద్ధిలో భాగస్వాములు అవ్వాలని పిలుపునిచ్చారు.. విమర్శలకు, విబేధాలకి తావులేకుండా సామరస్యంగా అందరూ కలిసి పనిచేయాలి అని అన్నారు.. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ ఛైర్మన్ గుడిపాటి శిరీష నవీన్ , కమిషనర్ శ్రీనివాస్ కౌన్సిలర్లు అధికారులు తదితరులు పాల్గొన్నారు..
Tags:
About The Author
Latest News
08 Apr 2026 23:24:30
( లోకల్ గైడ్ ): విద్యార్థినీ, విద్యార్థులు శ్రద్దతో చదివి ఉన్నత స్థానంలో నిలువాలని కేజీబీవీఎస్ఓ పి రాగసుధ అన్నారు. బుధవారం ముత్తూట్ ఎం జార్జ్
