ఎయిర్ పోర్ట్ లో 300 పారిశుద్ధ్య సిబ్బందికి ఉచిత వైద్య పరీక్షలు 

కార్యక్రమం జీఎంర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్

ఎయిర్ పోర్ట్ లో 300 పారిశుద్ధ్య సిబ్బందికి ఉచిత వైద్య పరీక్షలు 

శంషాబాద్ ,మార్చ 5: ( లోకల్ గైడ్);

శంషాబాద్
రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో గురువారము ఏసీఎఫ్ శిబిరం ఆధ్వర్యంలో క్యాబ్ డ్రైవర్లు మరియు విమానాశ్రయంలో విధులు నిర్వహిస్తున్న పారిశుధ్య ఆరోగ్య సిబ్బందికి ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమం జీఎంర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ సహకారంతో జరిగింది. ఈ సందర్భంగా విమానాశ్రయంలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగికి గొంతు పరీక్షలు, ఛాతీ ఎక్స్‌రేలు తదితర ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. మొత్తం 300 మందికి పైగా కార్మికులకు ఉచితంగా వైద్య పరీక్షలు చేసి అవసరమైన వైద్య సూచనలు అందించారు.కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడగా, కార్మికుల ఆరోగ్య పరిరక్షణ కోసం ఇలాంటి శిబిరాలు తరచుగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంయుక్త సంచాలకులు డాక్టర్ రాజేశం, డాక్టర్ శ్రీ ఘన, డాక్టర్ ఎన్. అనిల్ కుమార్, డాక్టర్ పాయల్, డాక్టర్ నవీన్, డాక్టర్ ఆదిత్య, శ్రీనివాసులు, సురేష్, జితేందర్, జిల్లా కార్యక్రమ పర్యవేక్షకులు శ్రీనివాసులు, జిల్లా ప్రాజెక్టు మేనేజర్ విల్సన్, విజయ్ కుమార్, సీనియర్ ట్రీట్‌మెంట్ సూపర్వైజర్ నరేష్ కుమార్, టిబి ఆరోగ్య బృంద సభ్యుడు మధుబాబు, రహీం, సీనియర్ ప్రయోగశాల పర్యవేక్షకులు సలీం, సాగర్, శ్రీనివాస్ రెడ్డి, రేడియాలజిస్ట్ జయేందర్, త్రివేణి, అనిత, సురేఖ, ప్రసన్న లక్ష్మి, జిఎంఆర్ విమానాశ్రయ మేనేజర్ రామస్వామి, శ్రీనివాస్, సతీష్, ఏఎన్‌ఎం ఆశ తదితరులు పాల్గొన్నారు.
ఐటెం ఎండ్.

Tags:

About The Author

Latest News

హుస్నాబాద్‌లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం హుస్నాబాద్‌లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం
సిద్దిపేట జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్ తెలంగాణ)  మార్చి17:మొక్కజొన్న రైతుల సౌకర్యార్థం హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినట్లు రాష్ట్ర రవాణా మరియు...
మే 11వ తేదీ నుండి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా జనగణన  మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్త ప్రకటన 
సహజ వ్యవసాయం వైపు రైతులు ముందుకు రావాలి
డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహణ.
వార్డ్ మెంబర్లకు రెండో విడత శిక్షణ విజయవంతం
గుండాల మండలంలో కలెక్టర్ అంకిత్ ఆకస్మిక తనిఖీలు – సేవల నాణ్యతపై కఠిన సమీక్ష
విజయలక్ష్మి హాస్పిటల్ తనిఖీ. షోకాస్ నోటీసులు జారీ.