శ్రీరామనవమి భక్తులకు సేవలు అందించనున్న పెన్షనర్స్ అసోసియేషన్

పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులకు సేవలు అందించేందుకు ఏర్పాట్లు

శ్రీరామనవమి భక్తులకు సేవలు అందించనున్న పెన్షనర్స్ అసోసియేషన్

 

భద్రాచలం : లోకల్ గైడ్ :
ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ భద్రాచలం డివిజన్ ఆధ్వర్యంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులకు సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేపట్టినట్లు సంఘం నాయకులు తెలిపారు. ఈ మేరకు 21 మార్చి 2026న సంఘం డివిజన్ కార్యాలయంలో అధ్యక్షులు బంధు వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 27 మార్చి 2026న భద్రాచలంలో జరిగే శ్రీరామనవమి సందర్భంగా ఆలయానికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం సంఘం తరఫున పానకం, వడపప్పు, మంచినీళ్ల ప్యాకెట్లు, పుచ్చకాయ ముక్కలు, మజ్జిగ ప్యాకెట్లు, తాటి ముంజలు తదితరాలను పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి 26 మార్చి 2026 గురువారం సాయంత్రానికి కమిటీ సభ్యులు తప్పనిసరిగా హాజరై ఏర్పాట్లలో పాల్గొనాలని, అలాగే 27న శుక్రవారం ఉదయం 9 గంటలకల్లా అన్ని పెన్షనర్స్ కార్యాలయానికి చేరుకుని సేవా కార్యక్రమాలలో భాగస్వాములు కావాలని సంఘం నాయకులు కోరారు. భక్తులకు సేవ చేయాలనే ఉద్దేశంతో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అధ్యక్షులు బంధు వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి కే ఎస్ఎల్ వీ ప్రసాద్, కోశాధికారి డీ కృష్ణమూర్తి విజ్ఞప్తి చేశారు.

Tags:

About The Author

Latest News

నాటక రచయితకు, నిర్వాహకులకు సన్మానం. నాటక రచయితకు, నిర్వాహకులకు సన్మానం.
*       ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి ఏప్రిల్01లోకల్ గైడ్    వరంగల్ రామన్నపేట లోని డాక్టర్.ఏ. రాజేంద్రప్రసాద్ భారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పోతన ఆడిటోరియంలో ప్రదర్శించబడిన పూరి...
సకల మానవాళికి ప్రమాదం యుద్ధం
జిల్లా వ్యాప్తంగా 30పోలీస్ యాక్ట్ అమలు.....
ప్రజాప్రతినిధుల ఆశీస్సులతో ఘనంగా వివాహ వేడుక
46వ డివిజన్‌లో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన
ప్రజల మధ్యే సంక్షేమం…  నేరుగా లబ్ధిదారుల చేతికి కోట్ల చెక్కులు..
కార్మిక లేబర్ కోడ్ ల అమలును నిరసిస్తూ కాటేదాన్ చౌరస్తా