దుద్దిళ్ల శ్రీపాదరావుకు పోలీసుల ఘన నివాళి

రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న జయంతి

దుద్దిళ్ల శ్రీపాదరావుకు పోలీసుల ఘన నివాళి

నారాయణపేట మార్చి 2:
నారాయణపేట జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో డీఎస్పీ నల్లపు లింగయ్య ఆధ్వర్యంలో స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి సందర్భంగా ఆయన చిత్రప టానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న జయంతి కార్యక్రమాలలో భాగంగా జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా డీఎస్పీ నల్లపు లింగయ్య మాట్లా డుతూ దుద్దిళ్ల శ్రీపాదరావు సౌమ్య మనస్తత్వం గల నాయకుడిగా ప్రజల మధ్యనే ఉంటూ వారి కష్టనష్టాల్లో భాగస్వామ్యులై ప్రజానా యకునిగా గుర్తింపు పొందారని పేర్కొన్నారు. స్పీకర్‌గా పనిచేసిన సమయంలో ఆయన నిజాయితీ, నిరాడంబరత ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో ఆయన చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ విజయ్ భాస్కర్, ఆఫీస్ సూపరింటెండెంట్ శంకర్ లాల్, ఎస్సైలు పురుషోత్తం, ఆర్‌ఎస్‌ఐ శ్వేత, జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయ సిబ్బంది, ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులు తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్:3.దుద్దిళ్లకు నివాళి అర్పించిన పోలీసులు
_____________________

Tags:

About The Author

Latest News

ఎలుకగూడెంలో ప్రజాపాలన 99 రోజుల ప్రణాళిక కార్యక్రమం ఎలుకగూడెంలో ప్రజాపాలన 99 రోజుల ప్రణాళిక కార్యక్రమం
    లోకల్ గైడ్:  చౌదరిగూడ జిల్లేడు చౌదరిగూడ మండలం,  ఎలుకగూడెం గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గురువారం గ్రామ శుభ్రత మరియు
మున్సిపాలిటీ కో-ఆప్షన్ రేసులో బండారు మహేష్?
అశ్వారావుపేటలో ప్రతిపక్షం అడ్రస్ గల్లంతు?
నూతన వధువరులకు శుభాకాంక్షలు 
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి..
వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఇందిరమ్మ ఇళ్ళ
మార్చి 28న సిద్దిపేటలో జాతీయ లోక్ అదాలత్